Ponguleti and Jupally | కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. రాహుల్ సమక్షంలో చేరిక
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమండ్ ఈనెల 20 లేదా 25లలో ఖమ్మంలో సభ 12న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు- రాహుల్, ప్రియాంకలతో సమావేశం విధాత: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు (Ponguleti and Jupally) లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీలో చేరతామని కాంగ్రెస్ హై కమాండ్‌కు తెలిపినట్లు సమాచారం. దీంతో వీరి చేరికపై పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ […]

- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమండ్
- ఈనెల 20 లేదా 25లలో ఖమ్మంలో సభ
- 12న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు- రాహుల్, ప్రియాంకలతో సమావేశం
విధాత: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు (Ponguleti and Jupally) లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీలో చేరతామని కాంగ్రెస్ హై కమాండ్‌కు తెలిపినట్లు సమాచారం.
దీంతో వీరి చేరికపై పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ నేల 20 లేదా 25 తేదీలలో ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పొంగులేటి, జూపల్లిలు ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతాని, వారి వర్గీలు చెపుతున్నారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈనెల 12వ తేదీన ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం.
మాజీ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ప్రస్తుత సీఎల్పీ నేత, తెలంగాణ నుంచి ఉన్న ఏఐసీసీ కార్యదర్శలు, ఇతర నాయకులంతా ఢిల్లీకి వెళతున్నట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఖమ్మం సభపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచాం.