భువనగిరి మున్సిపాల్టీ చైర్మన్‌గా పోతంశెట్టి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. అవిశ్వాసంతో గత బీఆరెస్ చైర్మన్‌ను గద్దె దించిన పిదప నూతన చైర్మన్ ఎన్నిక కోసం బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు
విధాత, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. అవిశ్వాసంతో గత బీఆరెస్ చైర్మన్‌ను గద్దె దించిన పిదప నూతన చైర్మన్ ఎన్నిక కోసం బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా, మాయ దశరథ వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా అధికారుల ప్రకటించారు.
సమావేశానికి 16 కాంగ్రెస్ మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడు ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డిలు హాజరయ్యారు. నూతన చైర్మన్‌గా ఎన్నికైన పోతంశెట్టి వెంకటేశ్వర్లు తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram