Komati Reddy | తెలంగాణలో 75 సీట్లతో అధికారం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy | విధాత: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు చేరడానికి స్వాగతిస్తున్నాను అన్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని తాను కోరుతున్నానన్నారు. టిఆర్ఎస్ బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మునుముందు మరిన్ని చేరికలు […]

  • Publish Date - June 26, 2023 / 12:44 AM IST

Komati Reddy |

విధాత: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు చేరడానికి స్వాగతిస్తున్నాను అన్నారు.

ఇతర పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని తాను కోరుతున్నానన్నారు. టిఆర్ఎస్ బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మునుముందు మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల ఫలితాల పిదప తెలంగాణలో బలం పుంజుకుందన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ షార్ట్ అండ్ స్వీట్ గా ఎన్నికల ప్రణాళికలతో ప్రజల ముందుకు వెళుతుందన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక అమలు చేసి తీరుతుందన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీతోనే నెరవేరుతాయన్నారు.