Hit 3 | నాని హిట్3 నుంచి.. ‘ప్రేమ వెల్లువ’ ఫీల్ గుడ్ సాంగ్! ప్రేక్షకులు మైమరిచిపోవడం గ్యారంటీ
Hit 3 | Prema Velluva Lyrical | HIT 3| Nani
విధాత: విజయవంతమైన హిట్ (HIT) సిరీస్ సినిమాల సీరిస్‌లో మూడో ప్రయత్నంగా హిట్3 థర్డ్ కేస్ (HIT: The 3rd Case) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా అర్జున్ సర్కార్ (Arjun Sarkaar) అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తోండగా కన్నడ సుందరి కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తోంది. వాల్‌పోస్టర్ సినిమా (Wall Poster Cinema), ఉనానిమస్ ప్రొడక్షన్స్ (Unanimous Productions) బ్యానర్లపై నాని భార్య శ్రీమతి ప్రశాంతి ఈ సినిమాను నిర్మిస్తోంది.
గతంలో హిట్1, హిట్2 రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ మూవీకి సైతం దర్శకత్వం వహిస్తున్నాడు. మే1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా టీజర్ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేయగా ఇప్పుడు ఈ మూవీ నుంచి ప్రేమ వెల్లువ అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా సిద్ శ్రీరాం (Sid Sriram), నూతన మోహన్ (Nutana Mohan) ఆలపించారు. మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తూ అతి తక్కువ సమయంలో అధిక వ్యూస్ రాబట్టుకుంటుంది. ముఖ్యంగా పాటలోని విజువల్స్, నాని, శ్రీనిధి ఫెయిర్, మ్యూజిక్, సాహిత్యం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండడంతో పాటు మళ్లీ మళ్లీ వినేలా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram