HIT 3: నాని హిట్ 3 టీజ‌ర్‌.. ర‌క్తంతో స్నానం చేయించేలా ఉన్నాడుగా

HIT 3: నాని హిట్ 3 టీజ‌ర్‌.. ర‌క్తంతో స్నానం చేయించేలా ఉన్నాడుగా

విధాత‌: విజ‌య‌వంత‌మైన హిట్ (HIT) సిరీస్ సినిమాల సీరిస్‌లో మూడో ప్ర‌య‌త్నంగా మ‌రో చిత్రం హిట్‌3 థ‌ర్డ్ కేస్‌ (HIT: The 3rd Case) తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. నాచుర‌ల్ స్టార్ నాని (Nani) హీరోగా అర్జున్ స‌ర్కార్ (Arjun Sarkaar) అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తోండ‌గా క‌న్న‌డ సుంద‌రి కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

గ‌త రెండు సినిమాల‌ను డైరెక్ట్ చేసిన‌ శైలేష్ కొల‌ను (Sailesh Kolanu) ఈ మూవీకి సైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మే1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా తాజాగా నాని జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం స‌ర్కార్స్ లాఠీ అంటూ ఓ టీజ‌ర్ రిలీజ్ చేశారు. వాల్‌పోస్ట‌ర్ సినిమా (Wall Poster Cinema), ఉనానిమ‌స్ ప్రొడ‌క్ష‌న్స్ (Unanimous Productions) బ్యాన‌ర్ల‌పై నాని శ్రీమ‌తి ప్ర‌శాంతి ఈ సినిమాను నిర్మిస్తోండ‌గా మిక్కీ జే మేయ‌ర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నాడు.

ఈ టీజ‌ర్‌ను చూస్తే జాన్ విక్‌, కిల్‌, ఇటీవ‌ల వ‌చ్చిన మార్కో సినిమాల‌ను త‌ల‌ద‌న్నే యాక్ష‌న్ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ బ్ల‌డ్ బాత్ మూవీగా తెర‌కెక్కించిన‌ట్లు అర్ధ‌మ‌వుతోంది. ఇన్నాళ్లు న‌న్ను చూసి మోస‌పోయారు. ఓరిజిన‌ల్ చూస్తారు అంటూ సినిమాలో నాని చెప్పే డైలాగులు సైతం సినిమాపై అంచ‌నాల‌ను పెంచేలా ఉన్నాయి. చూస్తుంటూ ఈ మేడే రోజున ర‌క్తంతో స్నానం చేయించేలా హిట్‌3 (HIT: The 3rd Case) సినిమా టీజ‌ర్ ఉంది.