తెల్లచీరలో కాక రేపుతున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఏమందంరా బాబు..!

తెల్లచీరలో కాక రేపుతున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఏమందంరా బాబు..!ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ సినిమా ఓరు ఆధార్ లవ్ అనే సినిమాలో నటించి మెప్పించిన ఈ అందాల ముద్దుగుమ్మ కన్నుగీటుతో తెగ ఫేమస్ అయింది.
ఆ సీన్‌తో కుర్రాళ్లని తన మాయలో పడేసి పిచ్చి క్రేజ్ సంపాదించుకుంది. సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు తెగ జోష్ పెంచింది. రీసెంట్‌గా గార్జియస్ లుక్‌తో హాట్ స్టిల్స్ ఇస్తూ ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. వైట్ కలర్ శారీలో కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రియా ప్రకాశ్ అందాలని ఇలా చూసి థ్రిల్ అవుతున్నారు.
వైట్ శారీ ధరించి చీరకట్టులో ఈ అమ్మడు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రియా ప్రకాశ్ క్యూట్ లుక్స్‌కి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. అమ్మడి ప్రభంజనం సోషల్ మీడియాని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. ప్రియా ప్రకాశ్‌కి అందం, అభినయం ఉన్నా కూడా ఎందుకో అవకాశాలు పెద్దగా రావడం లేదు.
వచ్చిన అవకాశాలని కూడా పెద్దగా సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రియా వారియర్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అతి చిన్నవయసులోనే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది.
ప్రియా ప్రకాశ్ వారియర్ కి ఇటీవల అంతగా అవకాశాలు రావడం లేదు. వచ్చిన సినిమాలు కూడా సక్సెస్ కావడం లేదు. దీంతో ప్రియా కెరీర్ పరిస్థితి దారుణంగా మారింది.. ఇటీవలే బ్రో సినిమాతో తెలుగు తెరపై సందడి చేసి అలరించింది ఈ ముద్దుగుమ్మ. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ చిత్రంలో తేజ్ చెల్లి పాత్రలో కనిపించింది.
అయితే సినీ ప్రపంచంలో కథానాయికగా ఓ వెలుగు వెలగాలని ప్రియా ఎప్పుడూ అనుకోలేదట కాని, అనుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఈ భామ ఇంట్లో అద్దం ముందు నిలబడి నచ్చిన హీరోయిన్స్ పాత్రల మాదిరిగా నటించేదానని పేర్కొంది. తన తల్లిదండ్రులు కూడా నటి అవుతానని అస్సలు అనుకోలేదని ఈ భామ తెలియజేసింది.