Priyanka Gandhi
విధాత: నిరుద్యోగుల నిరసన సభలో ప్రియాంక చేత యూత్ డిక్లరేషన్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఈ నెల 8వ తేదీన సాయంత్రం 3 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభలో నిరుద్యోగుల సమక్షంలో యూత్ డిక్లరేషన్ ఇస్తారని నాయకులు తెలిపారు.
యూత్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులు, నిరుద్యోగులను ఎలా ఆదుకుంటామో సభలో చెపుతామని అంటున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు. పలు సూచనలు చేశారు.
ఈ ఏర్పాట్లను ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి తదితర పార్టీ నాయకులు పరిశీలించారు.