Priyanka Mohan | మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్న నాని హీరోయిన్‌..! విజయ్‌కి జోడీగా ప్రియాంక..!

Priyanka Mohan | కన్నడ చిత్రం ‘ఓంధ్ కథే హెల్లా’ సినీ రంగ్ ప్రవేశం చేసింది ప్రియాంక ఆరుల్‌ మోహన్‌. ఆ తర్వాత న్యాచురల్‌ స్టార్‌ నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’లో అలరించింది. ఆ తర్వాత శ్రీకారంతో చిత్రంలో నటించిన చెన్నై బ్యూటీ ఇటీవల క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ (OG) హీరోయిన్‌గా ఎంపికయ్యింది. చిత్రం షూటింగ్‌ ఇప్పటికే మొదలవగా.. ఇటీవల ఓజీ వీడియో గ్లింప్స్‌లో ప్రియాంక కనిపించలేదు కానీ.. ప్రియాంక […]

  • Publish Date - September 10, 2023 / 01:07 AM IST

Priyanka Mohan |

కన్నడ చిత్రం ‘ఓంధ్ కథే హెల్లా’ సినీ రంగ్ ప్రవేశం చేసింది ప్రియాంక ఆరుల్‌ మోహన్‌. ఆ తర్వాత న్యాచురల్‌ స్టార్‌ నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’లో అలరించింది. ఆ తర్వాత శ్రీకారంతో చిత్రంలో నటించిన చెన్నై బ్యూటీ ఇటీవల క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ (OG) హీరోయిన్‌గా ఎంపికయ్యింది.

చిత్రం షూటింగ్‌ ఇప్పటికే మొదలవగా.. ఇటీవల ఓజీ వీడియో గ్లింప్స్‌లో ప్రియాంక కనిపించలేదు కానీ.. ప్రియాంక సాంగ్‌తో పాటు పవన్‌ కల్యాణ్‌తో కలిసి పలు సన్నివేశాలకు సంబంధించి షూటింగ్‌ జరిగింది. అయితే, ఈ బ్యూటీని మరో క్రేజీ ఆఫర్‌ వరించింది.

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించే చిత్రంలో హీరోయిన్‌గా లక్కీ ఛాన్స్‌ కోలీవుడ్‌లో టాక్‌. దళపతి విజయ్​ ప్రస్తుతం లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్‌ ‘లియో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత విజయ్‌ వెంకట్‌ ప్రభుతో 68వ చిత్రం చేయనున్నాడు. ఇందులో విజయ్‌కి జోడీగా సీనియర్​ నటి సిమ్రన్​ నటించనున్నది.

మరో లీడ్‌ రోల్‌లో ప్రియాంకను తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ వార్త నిజమైతే అయితే కోలీవుడ్‌లో బ్యూటీ రేంజ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రియాంక చివరిసారిగా తమిళ చిత్రం ‘డాన్‌’లో కనిపించింది. ఓజీ సినిమాతో పాటు ధనుష్‌ హీరోగా వస్తున్న తమిళ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నది.

Latest News