Prof Limbadri
విధాత, ప్రతినిధి నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల తన స్వంత గ్రామానికి విచ్చేస్తున్న సందర్బంగా రావుట్ల గ్రామ అభివృద్ధి కమిటీ & గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అభినందన సభను విజయవంతం చేయాలని బహుజన విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు యాట ప్రతాప్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి రవీందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, అంబేద్కర్ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డి. రామచంద్రం, విశ్రాంత న్యాయమూర్తి నిమ్మ నారాయణ, చేయూత స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధు శేఖర్ తదితరులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని విద్యావంతులు, ప్రొఫెసర్ లింబాద్రి సహ ఉద్యోగులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పత్రిక ముఖంగా తెలియజేశారు.