చిన్నారుల తల్లిదండ్రులూ.. మార్చి 3ను మరువొద్దు!

మనిషి జీవితాన్ని కకావికలం చేసే రోగం పోలియో. భారతదేశంలో దీన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు వరుస ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి

  • By: Somu    latest    Feb 19, 2024 11:38 AM IST
చిన్నారుల తల్లిదండ్రులూ.. మార్చి 3ను మరువొద్దు!
  • ఆ రోజు చిన్నారులకు పల్స్ పోలియో


విధాత, వనపర్తి బ్యూరో: మనిషి జీవితాన్ని కకావికలం చేసే రోగం పోలియో. భారతదేశంలో దీన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు వరుస ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ప్రతి ఏటా పల్స్‌పోలియో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీన 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేయనున్నారు.


3వ తేదీన ఏదేని కారణం చేత పోలియో చుక్కలు వెడుకోకుంటే  4,5 తేదీలలో రెండు రోజులు ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. పోలియో చుక్కలు వేసిన పిల్లల చేతి వేలిపై మార్కింగ్ చేస్తారు. ప్రయాణాల్లో ఉన్నవారికి వీలుగా ఆయా బస్టాండ్లలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 3న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం  ప్రజావాణి హాల్లో పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణ పై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. 


 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0-5 సంవత్సరాల వయస్సు గల ఏ ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయకుండా ఉండరాదని చెప్పారు. 3వ తేదీన ఏదేని కారణం చేత పోలియో చుక్కలు వేయించుకోకుంటే.. తదుపరి రెండు రోజుల్లో అంటే.. మార్చి 4, 5 తేదీలలో ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. జిల్లాలో 54030 మంది 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించామని, వీరందరికీ సరిపడా పోలియో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నదని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జయచంద్ర మోహన్ తెలిపారు.