Raghuvaran Brother | మా వదిన కారణంగానే.. మా అన్నయ్య రఘువరన్‌ చనిపోయాడు

Raghuvaran Brother | విలనిజానికి సరైన ఉదాహరణగా నప్పి, ఆ పాత్రను మెప్పించిన వారు కొందరే ఉన్నారు. భాష ఏదైనా ముఖంలో గంభీరతను నిలబెట్టగలిగే నటనా కౌశలం కొందరికే అబ్బింది. ఆ కొందరిలో దివంగత నటుడు రఘువరన్ ఖచ్చితంగా ఉంటాడు. రఘువరన్ మంచి నటుడు. విలన్ పాత్రలకు అతను నప్పినట్టుగా మరొకరు కుదరరు. ఈమాట ఇప్పటి రోజుల్లో కంటే 90 సినిమాల్లో అతగాడి నటన తెలిసిన వారు టక్కున ఒప్పుకుంటారు. అయితే ఇంత టాలెంట్ ఉండీ రఘువరన్ […]

  • By: krs    latest    Aug 13, 2023 2:00 AM IST
Raghuvaran Brother | మా వదిన కారణంగానే.. మా అన్నయ్య రఘువరన్‌ చనిపోయాడు

Raghuvaran Brother |

విలనిజానికి సరైన ఉదాహరణగా నప్పి, ఆ పాత్రను మెప్పించిన వారు కొందరే ఉన్నారు. భాష ఏదైనా ముఖంలో గంభీరతను నిలబెట్టగలిగే నటనా కౌశలం కొందరికే అబ్బింది. ఆ కొందరిలో దివంగత నటుడు రఘువరన్ ఖచ్చితంగా ఉంటాడు. రఘువరన్ మంచి నటుడు. విలన్ పాత్రలకు అతను నప్పినట్టుగా మరొకరు కుదరరు. ఈమాట ఇప్పటి రోజుల్లో కంటే 90 సినిమాల్లో అతగాడి నటన తెలిసిన వారు టక్కున ఒప్పుకుంటారు.

అయితే ఇంత టాలెంట్ ఉండీ రఘువరన్ మద్యానికి బానిసై చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన గురించి రఘువరన్ తమ్ముడు ఈమధ్య కాలంలో చెప్పిన విషయాలు సంచలనంగా నిలిచాయి. విషయంలోకి వెళితే.. చనిపోయే ముందు రఘువరన్ మానసికంగా నలిగిపోయాడని, చాలా యాతన పడ్డాడని చెప్పుకొచ్చాడు. దీనికంతకూ తన వదిన, రఘువరన్ భార్య రోహిణి కారణమనే సంచలన వాదన కూడా చేశాడు.

అయితే చనిపోయే సమయానికి తను బెంగుళూరులో ఉన్నానని, సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్ళినా ఫలితం లేకపోయిందని, అప్పటికే రఘువరన్ ఛాతీ నొప్పితో చనిపోయాడనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే జీవితంలోని ఒడిదుడుకులు తట్టుకోలేక శారీరకంగా, మానసికంగా అలసిపోయి భార్యతో విభేదాల కారణంగా విడిపోయి, కొడుకుకు దూరమై చాలా నరకయాతనకు గురయ్యాడని తెలిపాడు.

కొడుకంటే రఘువరన్‌కి చాలా ఇష్టం. తగాదాలతో విడిపోవడంతో కోర్టు వారంలో ఒకరోజు బిడ్డను చూసేలా, సమయం గడిపే విధంగా తీర్పు ఇచ్చింది. అలాగే కొడుకుని దగ్గరుండి చూసుకునేవాడు. అతనిని తిరిగి పంపేటప్పుడు చాలా బాధపడేవాడు. 2004లో రోహిణి, రఘువరన్ విడిపోయారు, వీరికి ఒక కొడుకు పేరు రిషివరన్. మానసినమైన ఇబ్బందులతో, మద్యానికి బానిసై 2008లో రఘువరన్ చనిపోయాడు.

అయితే అతని మద్యం అలవాటును భరించలేకే భర్తతో విడిపోయానని రోహిణి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే భర్త చనిపోయాక అతని జ్ఞాపకార్థం రఘువరన్ కంపోజ్ చేసి, పాడిన పాటలను సీడీ రూపంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల మీదుగా విడుదల చేసింది రోహిణి.

వ్యక్తిగతంగా జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు అనుభవించినా.. చేసిన సినిమాలతో రఘువరన్ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన సీరియస్ యాక్టింగ్ ప్రేక్షకులకు ఇప్పటికీ క్రేజే. ‘శివ’, ‘సుస్వాగతం’ సినిమాలో రఘువరన్ ఓ కొత్త తరహాలో కనిపిస్తాడు.