Flying kiss | మరో వివాదంలో రాహుల్‌గాంధీ.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటు మంత్రి స్మృతి ఇరానీ ఆరోపణ

Flying kiss మరో వివాదంలో రాహుల్‌గాంధీ నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటు మంత్రి స్మృతి ఇరానీ ఆరోపణ స్పీకర్‌కు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదులు విధాత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌సభలో బుధవారం తనకు ఫ్లయింగ్ కిస్ ఇస్తు రాహుల్‌గాంధీ వెళ్లిపోయారంటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా స్పందిస్తు రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. […]

Flying kiss | మరో వివాదంలో రాహుల్‌గాంధీ.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటు మంత్రి స్మృతి ఇరానీ ఆరోపణ

Flying kiss

మరో వివాదంలో రాహుల్‌గాంధీ
నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటు మంత్రి స్మృతి ఇరానీ ఆరోపణ
స్పీకర్‌కు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదులు

విధాత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌సభలో బుధవారం తనకు ఫ్లయింగ్ కిస్ ఇస్తు రాహుల్‌గాంధీ వెళ్లిపోయారంటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా స్పందిస్తు రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పుటేజీ చూసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ ఎంపీలు సైతం స్పీకర్ ను కలిసి, రాహుల్‌పై బీజేపీ ఎంపీలు అనవసర అసత్య ఆరోపణలు చేస్తున్నారంటు ఫిర్యాదు చేశారు.

ఈ వివాదంపై నిజానిజాల పరిశీలనకు స్పీకర్ లోక్‌సభ సీసీ టీవీ పుటేజీలను, లైవ్ పుటేజీలను పరిశీలిస్తున్నారు. టీవీ పుటేజీలలో రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికి ఆయన
ఆ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి అలా చేశారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకోనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా ఇప్పటికే రాహుల్‌గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే దొంగల ఇంటిపేరు మోడీనే ఉంటుందా అన్న వివాదస్పద వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దవ్వడం..శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడం జరిగింది. మళ్లీ లోక్‌సభ సమావేశాలకు హాజరవుతున్న రాహుల్ ఫ్లయింగ్ కిస్ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.