Rahul Gandhi
.విధాత: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూలీ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వేస్టేషన్‌ను గురువారం ఉదయం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే పోర్టర్లు, కూలీలు ఎదుర్కొంటున్నసమస్యలను అడిగి తెలుసుకున్నారు.
कुली भाइयों के बीच जननायक pic.twitter.com/nor4tSyoR8
— Congress (@INCIndia) September 21, 2023
కూలీలంతా వయనాడ్ ఎంపీ రాహుల్ చుట్టూ మూగారు. కూలీలు తమ యూనిఫామ్ అయిన రెడ్ షర్ట్‌ను ధరింపజేశారు. ఈ సందర్భంగా తన తలపై రాహుల్ సూట్‌కేస్ పెట్టుకొని మోశారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు రాహుల్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
#Congress MP #RahulGandhi turns Coolie (#porter) at Anand Vihar railway station in Delhi, carried a suitcase on his head, after wearing the red uniform shirt and badge they gave him and interacted with porters. pic.twitter.com/n6YsBdwPMh
— Surya Reddy (@jsuryareddy) September 21, 2023
” ఈ రోజు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ప్రజా నేత రాహుల్ గాంధీ పోర్టర్లను కలిశారు. ఇటీవల రైల్వే స్టేషన్‌లోని పోర్టర్లు రాహుల్‌ను కలవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిపై రాహుల్ స్పందించారు. ఈ రోజు రాహుల్ అక్కడికి చేరుకుని పోర్టర్ల సమస్యలు విన్నారు. భారత్ జోడో ప్రయాణం కొనసాగుతున్నది” అని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేసింది.