Karnataka | కర్ణాటక గృహలక్ష్మికి రాహుల్ ప్రారంభోత్సవం

Karnataka | విధాత: కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన దేశంలోనే అతిపెద్ద మహిళా సంక్షేమ పథకం గృహలక్ష్మిని కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్‌గాంధీ బుధవారం ప్రారంభించారు. కోటి పది లక్షల మంది మహిళలకు నెలకు రూ.2000లను వారి బ్యాంకు ఖాతాలోకే నేరుగా నగదు బదిలీ చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ పథకం అమలును ప్రారంభించడం విశేషం. इमारत की ताकत उसकी नींव में होती है। महिलाएं भारत की नींव […]

  • By: Somu    latest    Aug 30, 2023 10:30 AM IST
Karnataka | కర్ణాటక గృహలక్ష్మికి రాహుల్ ప్రారంభోత్సవం

Karnataka | విధాత: కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన దేశంలోనే అతిపెద్ద మహిళా సంక్షేమ పథకం గృహలక్ష్మిని కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్‌గాంధీ బుధవారం ప్రారంభించారు. కోటి పది లక్షల మంది మహిళలకు నెలకు రూ.2000లను వారి బ్యాంకు ఖాతాలోకే నేరుగా నగదు బదిలీ చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ పథకం అమలును ప్రారంభించడం విశేషం.

ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో ఇప్పటికే మూడు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో హామీ గృహలక్ష్మిని కూడా అమలు చేస్తుంది. తెలంగాణలో రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ..ఇచ్చిన ప్రతి హామిని అమలు చేస్తామని చెబుతుంది. ఇందుకు కర్ణాటకలో తామిచ్చిన ప్రధాన ఎన్నికల హామీల అమలు తీరును ఉదాహారణగా చూపుతూ ఓటర్లలో పార్టీ పట్ల నమ్మకాన్ని సాధించే ప్రయత్నం చేస్తుంది.