DK Shivakumar : సిద్దరామయ్యతో కలిసి పనిచేస్తాం

కర్ణాటక సీఎం మార్పు ఊహగానాలపై డీకే శివకుమార్ స్పందిస్తూ సిద్ధరామయ్యతో కలిసి ఐదేళ్లు పనిచేస్తామని మార్పు అంశానికి తావులేదని స్పష్టం చేశారు.

DK Shivakumar : సిద్దరామయ్యతో కలిసి పనిచేస్తాం

విధాత : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఉన్నారని… ఐదేళ్లు తానే సీఎం అని సిద్ధరామయ్య చెబుతున్నారని, మేము అంతా ఆయనతో కలిసి పని చేస్తాం అని ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలకు తావులేదు అని డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సందర్బంలో డీకే.శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో సీఎం మార్పు ఊహగానాలకు తెర పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే సమయంలో మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య ఐదేళ్లు తానే సీఎం గా కొనసాగుతానని స్పష్టం చేశారు. బడ్జెట్ కూడా నేనే ప్రవేశపెడతానని.. రేపు ఖర్గేతో సమావేశం అవుతానని తెలిపారు. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ లో అధికార మార్పిడి వ్యవహారానికి కాంగ్రెస్ హైకమాండ్ తెరదించినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ వెళ్లిన శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా దీనిపై స్పష్టత నిచ్చినట్లుగా సమాచారం. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో పదేపదే సీఎంల మార్పిడి అంశం పార్టీ విస్తరణకు ప్రతికూల ప్రచారానికి తావిచ్చినట్లవుతుందని..అందుకే ఈ దఫా సర్ధుకుపోవాలని డీకే శివకుమార్ కు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసినట్లుగా సమాచారం.