Rahul Gandhi | మణిపూర్‌ గాయం మాన్పుతాం: రాహుల్‌గాంధీ

Rahul Gandhi అక్కడి ప్రజల కన్నీళ్లు తుడుస్తాం మణిపూర్‌లో భారత్‌ను నిర్మిస్తాం ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ న్యూఢిల్లీ : ఇండియా కూటమిని ఉగ్ర సంస్థలతో పోల్చుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని పిలుచుకోండి. కానీ.. మిస్టర్‌ మోదీ.. మేం ‘ఇండియా’. మణిపూర్‌లో భారత నిర్మాణం అనే భావనను మేం పునర్నిర్మిస్తాం’ అని రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. Call us whatever […]

  • Publish Date - July 25, 2023 / 11:42 AM IST

Rahul Gandhi

  • అక్కడి ప్రజల కన్నీళ్లు తుడుస్తాం
  • మణిపూర్‌లో భారత్‌ను నిర్మిస్తాం
  • ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌

న్యూఢిల్లీ : ఇండియా కూటమిని ఉగ్ర సంస్థలతో పోల్చుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని పిలుచుకోండి. కానీ.. మిస్టర్‌ మోదీ.. మేం ‘ఇండియా’. మణిపూర్‌లో భారత నిర్మాణం అనే భావనను మేం పునర్నిర్మిస్తాం’ అని రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మణిపూర్‌ గాయాలు మాన్పేందుకు మేం సహకరిస్తాం. అక్కడి ప్రతి ఒక్క మహిళ, చిన్నారి కన్నీళ్లు తుడుస్తాం. అక్కడి భారతదేశ ప్రజల కోసం ప్రేమ, శాంతిని మళ్లీ తెస్తాం’ అని ఆయన తెలిపారు.