కార్పెంటర్‌గా మారిన రాహుల్‌గాంధీ

  • Publish Date - September 28, 2023 / 12:53 PM IST

Rahul Gandhi,carpenter, Congress, Delhi

విధాత : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తన భారత్‌ జోడో ప్రయాణంలో భాగంగా ఎక్కువగా ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలు, జీవన శైలి, వృత్తిదారుల సమస్యలపై అధ్యయనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్‌కి వెళ్లి కార్పెంటర్ సోదరులను కలిసి వారి వృత్తి నైపుణ్యాలను తెలసుకున్నారు. స్వయంగా కార్పెంటర్ల పనుల్లో తనో చేయి వేసి వారితో మమేకమై వారి పనితీరును, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా రాహుల్‌ కార్పెంటర్లను ఉద్ధేశించి “వారు కష్ట జీవులే కాదు, అందంగా చెక్కడంలో నిపుణులు, అద్భుతమైన కళాకారులు.” అంటూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. అంతకుముందు రాహుల్‌గాంధీ లారీ డ్రైవర్‌గా, పొలం పనుల్లో రైతుకూలీగా, ట్రాక్టర్‌ నడిపే రైతుగా, బైక్‌ మెకానిక్‌గా, లడ్డాక్‌లో బైక్‌ నడుపుతూ సైనికులతో కలిసి, రైల్వే కూలీగా, రైలులో సాధారణ ప్రయాణీకుడిగా మారి ఆయా వర్గాల ప్రజలతో మమేకమై వారి జీవన శైలీని అధ్యయనం చేస్తు సాగారు. ఇప్పుడు కార్పెంటర్‌గా మారిన రాహుల్‌ మునుముందు మరే పాత్రలో కనిపిస్తాడో వేచి చూడాలి.