Mancherial | ఉరిసిన మంచిర్యాల సర్కారు దవాఖాన.. రోగుల గదుల్లోకి వర్షం నీరు
Mancherial | Heavy Rains నీటిలో తడిసిన మందులు జిల్లాలో ఎడతెరిపి లేని వానలు అస్తవ్యస్తంగా పలు కాలనీలు విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సర్కారు దవాఖాన గదుల్లోకి వర్షపు నీరు చేరడంతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం గోదావరి […]

Mancherial | Heavy Rains
- నీటిలో తడిసిన మందులు
- జిల్లాలో ఎడతెరిపి లేని వానలు
- అస్తవ్యస్తంగా పలు కాలనీలు
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సర్కారు దవాఖాన గదుల్లోకి వర్షపు నీరు చేరడంతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
మాతా శిశు సంరక్షణ కేంద్రం గోదావరి ఒడ్డున నిర్మించడంతో వర్షాకాలం గోదావరి ఉప్పొంగి ఆస్పత్రి భవనం ముంపు గురవుతుందని ముందస్తుగా రోగులను మంచిర్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాల మూలంగా ఆసుపత్రి భవనం ఉరవడంతో వర్షపు నీరు రోగుల గదిలోకి చేరింది.
రోగులు బెడ్ల పై నుండి కాలు కింద పెట్టలేక అనేక అవస్థలు పడుతున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం నుండి తరలించిన మందులు, ఇతరత్రా వస్తువులు ఆస్పత్రి షెడ్డులో వేయడం మూలంగా అవి కూడా కొంతమేరకు తడిసిపోయాయి. జిల్లా అధికారులు, పాలకుల నిర్లక్ష్య ధోరణి మూలంగానే అవస్థ పడుతున్నామని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందుచూపు లేకుండా గోదావరి ఒడ్డున మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 18 కోట్లు పెట్టి నిర్మాణం చేసి ఫలితం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు . గోదావరి ఒడ్డున కాకుండా మంచిర్యాల నడిబొడ్డున మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మిస్తే ఈ ఇబ్బందులు తప్పేవని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. ఉదయం నుండి కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు రోడ్లపైకి వరద రావడం తో కాలనీ లు అస్తవ్యస్తంగా మారాయి.