Ram Charan | కంగ్రాట్స్ బావ అంటూ ఎన్టీఆర్ విష్ చేశాడు కాని, రామ్ చ‌ర‌ణ్ మౌనంగా ఉన్నాడేంటి?

Ram Charan | భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం గ‌త రాత్రి ప్ర‌క‌టించ‌గా, 2021 సంవ‌త్స‌రానికి జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డును అల్లు అర్జున్ ద‌క్కించుకున్నాడు. సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప చిత్రంలో పుష్ప‌రాజ్‌గా త‌న అద్భుత‌మైన న‌ట‌న‌, డైలాగ్ డెలివరీతో అద‌ర‌గొట్టి ఎంతో మంది ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌నికి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది. తొలిసారి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి చెందిన ఓ న‌టుడికి జాతీయ […]

  • By: sn    latest    Aug 25, 2023 1:24 AM IST
Ram Charan | కంగ్రాట్స్ బావ అంటూ ఎన్టీఆర్ విష్ చేశాడు కాని, రామ్ చ‌ర‌ణ్ మౌనంగా ఉన్నాడేంటి?

Ram Charan |

భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం గ‌త రాత్రి ప్ర‌క‌టించ‌గా, 2021 సంవ‌త్స‌రానికి జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డును అల్లు అర్జున్ ద‌క్కించుకున్నాడు. సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప చిత్రంలో పుష్ప‌రాజ్‌గా త‌న అద్భుత‌మైన న‌ట‌న‌, డైలాగ్ డెలివరీతో అద‌ర‌గొట్టి ఎంతో మంది ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌నికి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది.

తొలిసారి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి చెందిన ఓ న‌టుడికి జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డ్ రావ‌డంతో ఆయ‌న‌పై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ , వ‌రుణ్ తేజ్, దిల్ రాజు, నాగ‌బాబు వంటి వారు బ‌న్నీ ఇంటికి వెళ్లి మ‌రీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక చిరంజీవి, రాజ‌మౌళితో పాటు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెలియ‌జేశారు.

అయితే ఆర్ఆర్ఆర్ హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఎలా స్పందిస్తార‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అందుకు కార‌ణం ఆర్ఆర్ఆర్ తో అద‌ర‌గొట్టిన వీరిద్ద‌రిలో ఒక్క‌రికి కూడా నేష‌న‌ల్ అవార్డ్ రాక‌పోవ‌డం. అయితే పుష్ప‌తో అద‌ర‌గొట్టిన బ‌న్నీకి నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింద‌ని తెలిసిన వెంట‌నే ఎన్టీఆర్ తన ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

కంగ్రాచ్యులేష‌న్స్ బావా.. పుష్ప సినిమాకు గానూ ఈ విజ‌యం, అవార్డులు నీకు ద‌క్కి తీరాల్సిందే అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు జూనియ‌ర్. ఇక ఈ ట్వీట్‌కి బ‌న్నీ స్పందిస్తూ.. ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా నిజాయితీగా విష్‌ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా. నువ్వు నా హృద‌యాన్ని ట‌చ్ చేశావు ’ అంటూ అల్లు అర్జున్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్నందుకు బ‌న్నీకి చిరంజీవితో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, నాగ‌బాబు వంటి వారు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే మెగా ప‌వర స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇంత వరకు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలోనూ బ‌న్నీకి విషెస్ చెప్ప‌లేదు, ఆయ‌న‌ని క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌లేదు.

రంగ‌స్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుత న‌ట‌న బ‌ర‌చిన కూడా త‌న‌కి అవార్డ్ రాక‌పోవ‌డం ప‌ట్ల చ‌ర‌ణ్ నిరాశ, నిస్పృహలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రెండు సార్లు రామ్ చరణ్‌కు రావాల్సిన అవార్డ్ మిస్ అయిందని ఆ బాధ‌లో ఉన్నాడ‌ని , అందుకే బ‌న్నీకి కూడా విషెస్ తెలియ‌జేయ‌లేదు అని అంటున్నారు. మ‌రి కొంద‌రు రామ్ చ‌ర‌ణ్‌.. డైరెక్ట్‌గా బ‌న్నీకి కాల్ చేసి విష్ చేసాడ‌ని అంటున్నారు .