ముందు అన్నీ.. తర్వాతే పెళ్లి! రామ్‌చరణ్‌ హీరోయిన్‌ మొన్న వివాహం.. ఇప్పుడు గర్భవతి?

Kiara Advani విధాత‌, సినిమా: నాటి శ్రీదేవి నుంచి ఎందరో హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయం తెలియ కుండా దాచి పెట్టి తొంద‌ర తొంద‌ర‌గా హ‌డావుడిగా వివాహం చేసుకున్నారు. శ్రీ‌దేవితో పాటు కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, నీనా గుప్తా, సారికా, సెలీనా జైట్లీ, అమీ జాక్స‌న్, మ‌హిమా చౌద‌రి, అమృతా అరోరా, వీణా మాలిక్‌ల‌తో పాటు ఇటీవ‌ల వివాహం చేసుకున్న అలియా భ‌ట్ వ‌ర‌కు ఇలా గ‌ర్భం దాల్చిన త‌ర్వాత వివాహం చేసుకున్న వారే […]

ముందు అన్నీ.. తర్వాతే పెళ్లి! రామ్‌చరణ్‌ హీరోయిన్‌ మొన్న వివాహం.. ఇప్పుడు గర్భవతి?

Kiara Advani

విధాత‌, సినిమా: నాటి శ్రీదేవి నుంచి ఎందరో హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయం తెలియ కుండా దాచి పెట్టి తొంద‌ర తొంద‌ర‌గా హ‌డావుడిగా వివాహం చేసుకున్నారు. శ్రీ‌దేవితో పాటు కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, నీనా గుప్తా, సారికా, సెలీనా జైట్లీ, అమీ జాక్స‌న్, మ‌హిమా చౌద‌రి, అమృతా అరోరా, వీణా మాలిక్‌ల‌తో పాటు ఇటీవ‌ల వివాహం చేసుకున్న అలియా భ‌ట్ వ‌ర‌కు ఇలా గ‌ర్భం దాల్చిన త‌ర్వాత వివాహం చేసుకున్న వారే కావ‌డం విశేషం. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి రామ్ చరణ్ హీరోయిన్ కూడా చేరిందనేలా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పాన్ ఇండియాలో రేంజ్‌లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ. తెలుగులో ఆమె ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేశ్ బాబు సరసన, ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

బాలీవుడ్‌లో వ‌రుస క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది. హిట్టు మీద హిట్ కొడుతోంది. రీసెంట్‌గా ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాను పెళ్లాడిన విషయం తెలిసిందే. బంధుమిత్రులు, కొంతమంది సినీ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది.

వీళ్లిద్దరూ సుమారు మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటూ.. డేటింగ్ చేస్తున్నారనే వార్తతో పాటు.. తాజాగా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కియారా అద్వానీ పెళ్లికి ముందే గర్భం దాల్చిందట. డేటింగ్ సమయంలోనే ఇది జరిగిందంటూ బాలీవుడ్‌లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇటీవల కియారా అద్వానీ రెగ్యులర్‌గా చెకప్ చేయించు కునే హాస్పిటల్‌లో డాక్టర్స్ రిపోర్ట్స్ ద్వారా ఈ విషయం బయటపడిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న కియారా బాలీవుడ్‌లో ప్రచారం అవుతున్న ఈ వార్తలపై స్పందిస్తుందో లేదో చూడాలి.

ఇది ఇలా ఉండగా పెళ్లి అయిన తర్వాత ఆఫ‌ర్లు త‌గ్గిపోతాయి అనుకుంటారు. కానీ కియారా అద్వానీ చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం బాలీవుడ్‌కు సంబంధించినవే కావడం విశేషం. టాలీవుడ్‌లో మాత్రం రామ్ చరణ్, శంకర్ కాంబో సినిమాలో నటిస్తోంది. ఇవి కాక భారీగా తనకు ఆఫర్స్ వస్తున్నా కూడా డేట్స్ సర్దుబాటు చేయలేకపోతుందట. కానీ టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఆమె నుంచి ఎక్కువ సినిమాలు కోరుకుంటున్నారనేది మాత్రం వాస్తవం.