ఓ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్య‌క్ష‌మైన బ్లాక్ పాంథ‌ర్.. చూస్తే వ‌ణుకు పుట్ట‌క త‌ప్ప‌దు..

ఇటీవ‌లి కాలంలో అడ‌వి జంతువులు జ‌న‌వావాసాల్లోకి త‌రుచుగా వ‌స్తున్నాయి. మ‌రి ముఖ్యంగా పులులు గ్రామాల్లోకి ప్ర‌వేశించి జ‌నాల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.

  • By: Somu    latest    Feb 19, 2024 10:00 AM IST
ఓ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్య‌క్ష‌మైన బ్లాక్ పాంథ‌ర్.. చూస్తే వ‌ణుకు పుట్ట‌క త‌ప్ప‌దు..

విధాత: ఇటీవ‌లి కాలంలో అడ‌వి జంతువులు జ‌న‌వావాసాల్లోకి త‌రుచుగా వ‌స్తున్నాయి. మ‌రి ముఖ్యంగా పులులు గ్రామాల్లోకి ప్ర‌వేశించి జ‌నాల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే ఓ బ్లాక్ పాంథ‌ర్ ఓ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇంటి మెయిన్ డోర్ ముందు ద‌ర్జాగా ఆ బ్లాక్ పాంథ‌ర్ తిరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ క‌శ్వాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఇలా మీ ఇంట్లోకి ఓ అతిథి వ‌స్తే ఎలా ఉంటుందో ఊహించండి. నీల‌గిరి ప్రాంతంలోని ఓ ఇంట్లోని వీడియో ఇది అని ప‌ర్వీన్ క‌శ్వాన్ రాసుకొచ్చారు.

త‌మిళ‌నాడులోని నీల‌గిరి ప్రాంతంలో ఈ బ్లాక్ పాంథ‌ర్ క‌నిపించింది. ఇక ఈ వీడియోను చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్టించింది. ఈ ఘ‌ట‌న గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వీడియోకి లక్షల‌ వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. బ్యూటిఫుల్ అని కొందరు కామెంట్ చేస్తుంటే. .ఇంకొందరు చూస్తుంటేనే భయమేస్తోంది అని కామెంట్ చేశారు.