Reels madness: రీల్స్ పిచ్చి..ఆరుగురు అమ్మాయిలు దుర్మరణం !

Reels madness: రీల్స్ పిచ్చి..ఆరుగురు అమ్మాయిలు దుర్మరణం !

Reels madness: ఇన్ స్టా రీల్స్, సెల్పీల పిచ్చి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నప్పటికి యువత వాటికి దూరంగా ఉండటం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ పిచ్చి బారిన పడి దుర్మరణం చెందారు. యూపీలోని నగ్లా స్వామి గ్రామంలో యమునా నదిలో రీల్స్ తీసుకోవడానికి ఆరుగురు అమ్మాయిలు వెళ్లారు. వారు నది నీళ్లలోకి దిగి ఒకరి చేయి మరొకరు పట్టుకుని రీల్స్ చిత్రీకరిస్తున్న క్రమంలో ఓ అమ్మాయి లోతైన ప్రదేశం వైపు అడుగు వేయడంతో నదిలో మునిగిపోయింది. ఆమెను రక్షించేందుకు మిగతా వారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆరుగురు అమ్మాయిలు యమునా నదిలో కొట్టుకపోయారు. వారిని కాపాడేందుకు అక్కడే ఉన్న ఇద్దరు యువకులు ప్రయత్నించినప్పటికి సాధ్యం కాలేదు.

ఆరుగురు నీళ్లలో కొట్టుుకపోగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారికోసం నదిలో గాలించి ఆరుగురిని బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే నలుగురు చనిపోగా..కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని అతికష్టం మీద కాపాడి ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతు వారు కూడా మరణించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు. ఈ ఘటన బాధిత కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదాన్ని కల్గించింది. మృతుల ఇళ్లకు యమునా నది కేవలం 800మీటర్ల దూరంలోనే ఉంది. చనిపోయిన అమ్మాయిల్లో ముస్కాన్ అనే యువతికి ఇటీవలే నిశ్చితార్థమైంది. నవంబర్ నెలలోనే పెళ్లి నిర్ణయించగా..ఇంతలోనే నీట మునిగి చనిపోయింది.