Revanth Reddy | వరద సహాయక చర్యల్లో పాల్గొనండి: రేవంత్ రెడ్డి
Revanth Reddy కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు కిసాన్ కాంగ్రేస్ రైతు భరోసా యాత్ర వాయిదా విధాతః గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని, వరదలతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రజలకు సహాయ చర్యలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమై ప్రజలు వరద నీటితో […]

Revanth Reddy
- కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు
- కిసాన్ కాంగ్రేస్ రైతు భరోసా యాత్ర వాయిదా
విధాతః గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని, వరదలతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రజలకు సహాయ చర్యలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమై ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారన్నారు.
పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడం, ముంపునకు గురైన ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కిసాన్ కాంగ్రేస్ రైతు భరోసా యాత్ర వాయిదా
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కిసాన్ కాంగ్రెస్ తలపెట్టిన రైతు భరోసా యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా చైర్మన్ సుంకెట అన్వేశ్‌రెడ్డి తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్ర ప్రజలు, రైతన్నలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ సమయంలో రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. వర్షాలు తగ్గాక మళ్ళీ రైతు భరోసా యాత్ర ను కొనసాగిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో కిసాన్ కాంగ్రెస్ శ్రేణులు రైతులకు అందుబాటులో ఉండాలని, రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.