లీకుల సర్కారుకు ఓటుతో సమాధానం: రేవంత్ రెడ్డి

  • Publish Date - September 24, 2023 / 12:04 PM IST

విధాత, హైదరాబాద్: పోటీ పరీక్షల నిర్వహణ చేతకాని కేసీఆర్‌కు, లీకుల సర్కారు చేసిన అన్యాయానికి నిరుద్యోగ యువత ఓటు పోటుతో సమాధానం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరుద్యోగి మహేష్.. ట్విట్టర్‌లో రేవంత్ రెడ్డికి తన ఆవేదన తెలియజేశారు. ఇందుకు స్పందించిన రేవంత్… మహేష్‌కు భరోసా ఇచ్చారు.

‘దిగులుపడకు మహేష్..‌ ఇంకో మూడు నెలలు ధైర్యం కూడగట్టుకుని ఉండు. నిరాశ చెందక నీ ప్రిపరేషన్ కొనసాగించు. ఈ లీకుల సర్కారు చేసిన అన్యాయానికి ఓటు పోటుతో సమాధానం చెప్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా, త్వరితగతిన ఖాళీలను భర్తీ చేస్తాం. నీకు, నీ కుటుంబానికి, యావత్ యువతరానికి అండగా ఉంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ!’ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ధైర్యం నింపుతూ భరోసా ఇచ్చారు.