Free Electricity | రేవంత్‌రెడ్డి తానా సభలో ఉచిత విద్యుత్‌పై అన్న మాటలివే…
Free Electricity విధాత: తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమెరికాలో తానా సభలో ఒక వ్యక్తి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను కంటిన్యూ చేస్తారా అని వేసిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. రైతులకు 3గంటల విద్యుత్ చాలు అని రేవంత్‌రెడ్డి అన్నట్లు వీడియో ఒకటి వైరల్ అయింది. బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల మంటలు రేగాయి. ఇంతకూ రేవంత్‌రెడ్డి ఏమన్నారో.. యధాతధంగా మీకోసం. "తెలంగాణలో 95 శాతం రైతులు […]

Free Electricity
విధాత: తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమెరికాలో తానా సభలో ఒక వ్యక్తి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను కంటిన్యూ చేస్తారా అని వేసిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు.
రైతులకు 3గంటల విద్యుత్ చాలు అని రేవంత్‌రెడ్డి అన్నట్లు వీడియో ఒకటి వైరల్ అయింది. బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల మంటలు రేగాయి. ఇంతకూ రేవంత్‌రెడ్డి ఏమన్నారో.. యధాతధంగా మీకోసం.
“తెలంగాణలో 95 శాతం రైతులు మూడు ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులు. మూడెకరాలు అంటే ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాలకు నీళ్లు పట్టాలంటే, ఫుల్లుగా మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు మూడు గంటలు చాలు. టోటల్‌గా ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది.
కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తిపడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్ తీసుకొచ్చిండు. ఉచిత కరెంట్‌తో చంద్రశేఖర్‌రావుగారు ప్రజలను మభ్యపెడుతుండు. సో ఇట్లాంటి ఉచితమనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దు. ఉచిత కరెంటు విషయంలో మా రైతు డిక్లరేషన్‌లో చెప్పాం.’ అంటూ ప్రసంగించారు.