ఇంట్లో తండ్రి మృతదేహం.. బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు
తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే ఇంటర్ పరీక్షకు హాజరైన నెల్లూరు విద్యార్థి రాంసాయి కథ అందరినీ కదిలిస్తోంది. తండ్రి ఆశ కోసం కన్నీటి మధ్య పరీక్ష రాశాడు.
విధాత : ఒకవైపు ఇంటర్ పరీక్షలకు వెళ్లాల్సిన పరిస్థితి.. మరోవైపు ఇంట్లో తండ్రి మృతదేహం.. అయినా తండ్రి ఆశించిన మేరకు ఆ కొడుకు ఇంటర్ పరీక్షలకు హాజరైన కన్నీటి ఘట్టం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తండ్రి చనిపోయాడన్న బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థి కందం రాంసాయి తండ్రి నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోయారు. బరువెక్కిన హృదయంలో తండ్రి అంత్యక్రియలు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఓ వైపు.. ఇంటర్ పరీక్షలు మరోవైపు ఆ విద్యార్థినిని మరింత బాధలోకి నెట్టాయి. చివరకు బంధువులు, లెక్చరర్లు ధైర్యం చెప్పడంతో రాంసాయి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. తండ్రి తన పిల్లాడు బాగా చదువుకోవాలనే ఆశించాడని, ఆయన ఆశయం మేరకు పరీక్ష రాయాలని బంధువులు అంతా నచ్చచెప్పారు. దీంతో రాంసాయి తండ్రిని కోల్పోయిన దుఃఖంను గుండెల్లోనే దాచుకుని.. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్ష ముగిశాక తిరిగొచ్చి తండ్రి అంత్యక్రియల బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ పరిణామం గ్రామస్తులను, బంధువులను, సాటి విద్యార్థులను సైతం తీవ్రంగా కలిచివేసింది. వారంతా కూడా రాంసాయి తండ్రి అంత్యక్రియలలో పాల్గొని అతనిని ఓదార్చారు.
ఇంట్లో తండ్రి మృతదేహం.. బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు
తండ్రి చనిపోయాడన్న బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. సంగం మండల కేంద్రానికి చెందిన కందం రాంసాయి తండ్రి నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోయారు. బంధువులు, లెక్చరర్లు ధైర్యం… pic.twitter.com/r0NDmKdCm3
— ChotaNews App (@ChotaNewsApp) February 23, 2026
ఇవి కూడా చదవండి :
Lung Cancer | లంగ్ క్యాన్సర్‌ను ముందే గుర్తించండిలా..
Adulterated Milk : తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం…నలుగురు మృతి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram