ఆకట్టుకుంటున్న రివర్స్ వాటర్ ఫాల్.. మీరు ఓ లుక్కేయండి..
Reverse Waterfall | వాటర్ ఫాల్స్ అనగానే మనసులో ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతోంది. ఆ జలపాతాలు పాల నురగలా పొంగుతుంటే మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది. ఆ దృశ్యాలు చూసే కనులకు ఎంతో ఇంపుగా ఉంటాయి. అయితే జలపాతాలు సాధారణంగా కొండ ప్రాంతాల నుంచి దిగువకు ప్రవేశిస్తాయి. కానీ ఈ జలపాతం అందుకు భిన్నంగా ఉంది. మరి ఆ జలపాతం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మహారాష్ట్రకు వెళ్లాల్సిందే. మహారాష్ట్రలోని ఓ వాటర్ ఫాల్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. […]

Reverse Waterfall | వాటర్ ఫాల్స్ అనగానే మనసులో ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతోంది. ఆ జలపాతాలు పాల నురగలా పొంగుతుంటే మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది. ఆ దృశ్యాలు చూసే కనులకు ఎంతో ఇంపుగా ఉంటాయి. అయితే జలపాతాలు సాధారణంగా కొండ ప్రాంతాల నుంచి దిగువకు ప్రవేశిస్తాయి. కానీ ఈ జలపాతం అందుకు భిన్నంగా ఉంది. మరి ఆ జలపాతం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మహారాష్ట్రకు వెళ్లాల్సిందే.
మహారాష్ట్రలోని ఓ వాటర్ ఫాల్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జలపాతం లోయలోకి రాకుండా రివర్స్‌లో గాల్లోకి ఎగిరిపోయింది. వాటర్ ఫాల్‌కు వ్యతిరేక దిశలో లోయలో బలమైన గాలులు వీచడంతోనే ఇలా రివర్స్‌లో జలపాతం గాల్లోకి ఎగిరిపోతుందని నిపుణులు పేర్కొన్నారు.
ఈ అరుదైన అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియోను వండర్ ఆఫ్ సైన్స్ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.