Rishi Sunak | అక్రమ వలసదారులపై ఉక్కుపాదం.. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌గా రిషి సునాక్..
Rishi Sunak | అక్రమ వలసదారులపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్రమ వలసదారులను గుర్తించాలని రిషి సునాక్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమ వలసదారులను గుర్తించేందుకు బ్రిటన్ వ్యాప్తంగా 159 చోట్ల దాడులు నిర్వహించారు అధికారులు. హోటల్స్, షాపింగ్ మాల్స్, కార్ వాషింగ్ సెంటర్లలో పని చేస్తున్న 25 దేశాలకు చెందిన 105 మందిని అరెస్టు చేసినట్లు ఆ […]

Rishi Sunak | అక్రమ వలసదారులపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్రమ వలసదారులను గుర్తించాలని రిషి సునాక్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో అక్రమ వలసదారులను గుర్తించేందుకు బ్రిటన్ వ్యాప్తంగా 159 చోట్ల దాడులు నిర్వహించారు అధికారులు. హోటల్స్, షాపింగ్ మాల్స్, కార్ వాషింగ్ సెంటర్లలో పని చేస్తున్న 25 దేశాలకు చెందిన 105 మందిని అరెస్టు చేసినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.
ఈ దాడుల నేపథ్యంలో అధికారుల పనితీరును పరిశీలించేందుకు నార్త్ లండన్‌లోని బ్రెంట్‌లో జరిగిన తనిఖీల్లో రిషి సునాక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి స్వయంగా పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు సునాక్.
అరెస్టు అయిన వారిలో 40 మందిని జైళ్లలో వేశారు. మిగిలిన వారిని ఇమ్మిగ్రేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్లు బ్రిటన్ హోం మంత్రి సువెల్లా బ్రవెర్మన్ తెలిపారు. అక్రమ వలసదారుల వల్ల సమాజానికి హానీ కలుగుతుందన్నారు.
నిజాయితీతో పని చేసే కార్మికుల ఉపాధికి కూడా గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులు పన్నులు కూడా చెల్లించరు అని తెలిపారు. తమ చట్టాలను ఉల్లంఘించడాన్ని, సరిహద్దులను అక్రమంగా దాటడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం అని సువెల్లా స్పష్టం చేశారు.
You may have noticed something different on Wednesday…
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!Yes – we put binary code on the No10 door to mark #LondonTechWeek