Lalu Prasad Yadav | లాలూ.. బ్యాడ్మింటన్!
Lalu Prasad Yadav కిడ్నీ ఆపరేషన్ తర్వాత జోరుగా ఆట సోషల్ మీడియాలో వీడియో వైరల్ విధాత: కొందరు కిడ్నీ, గుండె ఆపరేషన్ తర్వాత నడవడానికే ఆపసోపాలు పడుతుంటారు. కానీ, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ 75 ఏండ్ల వయస్సులో కూడా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. శనివారం ఉదయం లాలూ ఆట ఆడుతుండగా ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వీడియో తీశారు. దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. View […]
Lalu Prasad Yadav
- కిడ్నీ ఆపరేషన్ తర్వాత జోరుగా ఆట
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
విధాత: కొందరు కిడ్నీ, గుండె ఆపరేషన్ తర్వాత నడవడానికే ఆపసోపాలు పడుతుంటారు. కానీ, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ 75 ఏండ్ల వయస్సులో కూడా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. శనివారం ఉదయం లాలూ ఆట ఆడుతుండగా ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వీడియో తీశారు. దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.
View this post on Instagram
సవాళ్లను ఎదుర్కోవడంలో సదా సిద్ధంగా ఉండాలనే సంకల్పాన్నివ్యక్తంచేశారు లాలూ. 1977లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు తాను కొన్న జీపును లాలూ రెండేండ్ల క్రితం స్వయంగా నడిపి పాట్నా ప్రజలను ఆశ్చర్యపరిచారు. గత ఏడాది సింగపూర్‌లో లాలూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స కోసం యాదవ్ కుమార్తె తన కిడ్నీని దానం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram