SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రోబో ఆపరేషన్!

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరో రెండు ప్రాంతాల్లో కార్మికులు, ర్యాట్ మైనర్స్ తవ్వకాలు జరుపుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేసేందుకు రోబోటిక్ టెక్నాలాజీని వినియోగించాలని నిర్ణయించారు. రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. పరిస్థితులను అంచనా వేయడానికి లోకోట్రైన్‌లో టన్నెల్‌లోకి కమ్యూనికేషన్ రోబో ను తీసుకెళ్లారు.

SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రోబో ఆపరేషన్!

SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. ప్రమాదంలో గల్లంతైన 8మందిలో ఒక్కరి మృతదేహం మాత్రమే బయటకు తేగలిగారు. మిగతా వారి ఆచూకీ కోసం క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరో రెండు ప్రాంతాల్లో కార్మికులు, ర్యాట్ మైనర్స్ తవ్వకాలు జరుపుతున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేసేందుకు రోబోటిక్ టెక్నాలాజీని వినియోగించాలని నిర్ణయించారు. రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. పరిస్థితులను అంచనా వేయడానికి లోకోట్రైన్‌లో టన్నెల్‌లోకి కమ్యూనికేషన్ రోబో ను తీసుకెళ్లారు. మొదటి షిఫ్టులో 110మంది రెస్క్యూ బృందం టన్నెల్ లోకి వెళ్లింది. తాజా పరిస్థితులపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపు టన్నెల్‌లోకి రోబోలను తీసుకెళ్లాలని నిర్ణయించారు.

టన్నెల్‌లోకి రోబోలను కూడా పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక కలెక్టర్ సంతోష్ వెల్లడించారు. అందుకు సంబంధించి ఐదుగురితో కూడిన బృందం 3 రోబోలతో పని చేయనుందన్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఆ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో రెస్క్యూ కొనసాగుతుందన్నారు.