ఆమె కంటిలో నుంచి రాళ్ల ప్రవాహం.. ఇప్పటికే బయటపడ్డ 200 రాళ్లు..
Karnataka | ఓ మహిళ కంటి నుంచి నీటి ప్రవాహం మాదిరిగా రాళ్ల ప్రవాహం కొనసాగుతోంది. ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా ఆమె కంటి నుంచి ఇప్పటి వరకు 200 రాళ్లు బయట పడ్డాయి. కంటి నీళ్లతో పాటు రాళ్లు కూడా బయటకు వస్తుండటం ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక హన్సూర్ తాలుకా పరిధిలోని బెంకిపురా గ్రామానికి చెందిన విజయ(35)కు గత వారం పది రోజుల నుంచి తలనొప్పి రావడం, తలపై […]

Karnataka | ఓ మహిళ కంటి నుంచి నీటి ప్రవాహం మాదిరిగా రాళ్ల ప్రవాహం కొనసాగుతోంది. ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా ఆమె కంటి నుంచి ఇప్పటి వరకు 200 రాళ్లు బయట పడ్డాయి. కంటి నీళ్లతో పాటు రాళ్లు కూడా బయటకు వస్తుండటం ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక హన్సూర్ తాలుకా పరిధిలోని బెంకిపురా గ్రామానికి చెందిన విజయ(35)కు గత వారం పది రోజుల నుంచి తలనొప్పి రావడం, తలపై నుంచి ఏదో దొర్లుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత కుడి కన్ను నుంచి నీళ్లతో పాటు రాళ్లు రావడం గమనించింది. దీంతో ఆ ఊరి టీచర్ సలహా మేరకు ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వెళ్లింది. విజయ పీహెచ్‌సీ వెళ్లగా.. కంటి డాక్టర్‌ను కలవాలని, అందుకు మైసూర్ వెళ్తే మంచిదని సూచించారు.
దీంతో బాధిత మహిళ మైసూరులోని కేఆర్ హాస్పిటల్‌కు వెళ్లింది. ఆమె కంటి నుంచి రాళ్లు రావడాన్ని చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. విజయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి నుంచి రాళ్లు రావడానికి గల కారణాలు ఈ పరీక్షల్లో నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. చిన్నతనంలో రాళ్లు, మట్టి తినే అలవాటు ఏమైనా ఉండేదా? అని డాక్టర్లు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని ఆమె చెప్పారు.