Hyderabad | ప్రవీణ్ కుమార్.. కోదండరామ్ హౌస్ అరెస్ట్

Hyderabad | విధాత: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అఖిలపక్షం పిలుపుమేరకు గన్ పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షకు సిద్ధమైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ను, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ (kodandaram)  పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వారు తమ ఇళ్లలోనే మౌన దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా.. అర్ధరాత్రి నుంచి ప్రవీణ్ కుమార్, కోదండరామ్ ల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి వారిని హౌస్ అరెస్టు చేశారు. […]

  • By: Somu    latest    Aug 12, 2023 12:28 AM IST
Hyderabad | ప్రవీణ్ కుమార్.. కోదండరామ్ హౌస్ అరెస్ట్

Hyderabad | విధాత: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అఖిలపక్షం పిలుపుమేరకు గన్ పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షకు సిద్ధమైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ను, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ (kodandaram) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వారు తమ ఇళ్లలోనే మౌన దీక్ష కొనసాగిస్తున్నారు.

కాగా.. అర్ధరాత్రి నుంచి ప్రవీణ్ కుమార్, కోదండరామ్ ల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి వారిని హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు గన్ పార్క్ వద్ద నిరుద్యోగ దీక్షకు భారీగా నిరుద్యోగులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులతో కట్టడి చేస్తున్నారు.