Rupee Value | డాలరుతో పోలిస్తే బలపడిన రూపాయి
విధాత: డాలర్‌తో పోలిస్తే రూపాయి (Rupee Value) ఏడు పైసలు బలపడి ఒక డాలర్‌కు రూ.82.56 వద్ద స్థిరపడింది. విదేశీ మార్కెట్‌లలో డాలర్ బలహీనపడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. డాలరుకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.20 శాతం తగ్గి బ్యారెల్‌కు 76.56 డాలర్లకు చేరింది. కాగా.. రూపాయి విలువ కొన్ని వారాల పాటు 82.20 82.85 మధ్య కొనసాగే అవకాశముందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పబారీ అభిప్రాయపడ్డారు. మరో వారంలో ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని […]

విధాత: డాలర్‌తో పోలిస్తే రూపాయి (Rupee Value) ఏడు పైసలు బలపడి ఒక డాలర్‌కు రూ.82.56 వద్ద స్థిరపడింది. విదేశీ మార్కెట్‌లలో డాలర్ బలహీనపడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. డాలరుకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.20 శాతం తగ్గి బ్యారెల్‌కు 76.56 డాలర్లకు చేరింది.
కాగా.. రూపాయి విలువ కొన్ని వారాల పాటు 82.20 82.85 మధ్య కొనసాగే అవకాశముందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పబారీ అభిప్రాయపడ్డారు. మరో వారంలో ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించనుండటంతో మార్కెట్ ఆచితూచి స్పందిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపోరేటును ఆర్బీఐ అలానే కొనసాగిస్తుందని తెలుస్తోంది.