Sachin Tendulkar | 90లలో చాలా సార్లు ఔటైన లెజండ‌రీ క్రికెట‌ర్స్ వీరే.. టాప్‌లో స‌చిన్

Sachin Tendulkar:  క్రికెట‌ర్స్ త‌మ కెరీర్‌లో చాలా సెంచ‌రీలు సాధించాల‌ని ఎంతో అనుకుంటారు. అర్ధ‌సెంచ‌రీల‌ని సెంచ‌రీలుగా మ‌లిచే ప్ర‌య‌త్నం చాలా మంది చేస్తుండ‌గా, కొన్ని సార్లు 90ల‌లో చాలా మంది క్రికెటర్స్ అవుతుంటారు. అప్పుడు వారి మ‌న‌సులో క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. అయితే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో లెజండ‌రీ క్రికెట‌ర్స్‌గా చెప్పుకునే చాలా మంది క్రికెట‌ర్స్ 90 నుండి 99 మ‌ధ్య చాలా సార్లు ఔట‌య్యారు. వారిలో స‌చిన్ టెండూల్కర్ టాప్ లో నిలుస్తారు. స‌చిన్ త‌న […]

  • By: sn    latest    Jul 30, 2023 9:02 AM IST
Sachin Tendulkar | 90లలో చాలా సార్లు ఔటైన లెజండ‌రీ క్రికెట‌ర్స్ వీరే.. టాప్‌లో స‌చిన్

Sachin Tendulkar: క్రికెట‌ర్స్ త‌మ కెరీర్‌లో చాలా సెంచ‌రీలు సాధించాల‌ని ఎంతో అనుకుంటారు. అర్ధ‌సెంచ‌రీల‌ని సెంచ‌రీలుగా మ‌లిచే ప్ర‌య‌త్నం చాలా మంది చేస్తుండ‌గా, కొన్ని సార్లు 90ల‌లో చాలా మంది క్రికెటర్స్ అవుతుంటారు. అప్పుడు వారి మ‌న‌సులో క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. అయితే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో లెజండ‌రీ క్రికెట‌ర్స్‌గా చెప్పుకునే చాలా మంది క్రికెట‌ర్స్ 90 నుండి 99 మ‌ధ్య చాలా సార్లు ఔట‌య్యారు. వారిలో స‌చిన్ టెండూల్కర్ టాప్ లో నిలుస్తారు. స‌చిన్ త‌న వ‌న్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు చేయ‌గా, ఈ శతాబ్దాల సంఖ్య వాస్తవానికి 67గా ఉండేది. అత‌ను తొంభైల్లో 18 సార్లు ఔటయ్యాడు. ఈ అవాంఛిత రికార్డు ఇప్పటి వ‌ర‌కు స‌చిన్ పేరు మీద‌నే ఉంది.

ఇక న్యూజిలాండ్ మాజీ వెటరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ నాథన్ ఆస్టిల్ . .1995 నుంచి 2007 వరకు 223 వ‌న్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను 217 ఇన్నింగ్స్‌లలో 34.92 సగటుతో 7090 పరుగులు చేయ‌డ‌గా, కెరీర్‌లో 16 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలు చేశాడు. కాని తన కెరీర్‌లో మొత్తం 9 సార్లు 90ల్లో ఔటవ్వ‌డం గ‌మన‌ర్హం. ఇక జింబాబ్వే వన్డే జట్టు మాజీ కెప్టెన్ గ్రాంట్ ఫ్లవర్ ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. అద్భుత‌మైన క్రికెట్‌తో ఆల్‌రౌండ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. వ‌న్డే కెరీర్ చూస్తే.. గ్రాంట్ ఫ్లవర్ 221 వన్డేలు ఆడి 33.52 సగటుతో 6571 పరుగులు చేశాడు. అయితే అత‌ని కెరీర్‌లో 6 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు ఉండ‌గా, మొత్తం 9 సార్లు తొంభైలలో ఔట‌య్యాడు.

ఇక శ్రీలంక మాజీ వెటరన్ ఆటగాడు అరవింద్ డి సిల్వా 1984 నుంచి 2003 వరకు తన కెరీర్‌లో మొత్తం 308 వన్డేలు ఆడాడు. అత‌ను 34.90 సగటుతో మొత్తం 9284 పరుగులు చేశాడు. అయితే ఈ క్రికెట‌ర్ 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 11 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు చేసిన అత‌ను 9 సార్లు తొంభైల్లో ఔటయ్యాడు. త‌న జట్టు కోసం చాలా మ్యాచ్‌లను సింగిల్‌గా గెలిపించిన అత‌ను ఈ ప్ర‌త్యేక‌మైన రికార్డ్‌ని త‌న పేరిట న‌మోదు చేసుకోవ‌డం విశేషం.