సైఫ్‌, కరీనా క‌పూర్.. ఖ‌రీదైన ఇళ్ల విలువ తెలిస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మడం ఖాయం..!

  • By: sn    latest    Sep 27, 2023 3:50 PM IST
సైఫ్‌, కరీనా క‌పూర్.. ఖ‌రీదైన ఇళ్ల విలువ తెలిస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మడం ఖాయం..!

బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ముద్దుగా ఈ అమ్మ‌డి బెబో అని పిలుచుకుంటారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కి త‌ల్లి అయిన కూడా క‌రీనా అందం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆమె క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది, వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. అయితే ఈ అమ్మ‌డు బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతుంది. చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవలే ఓ వెబ్‌ సీరిస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైఫ్‌ అలీఖాన్‌కు గతంలోనే వివాహం జరుగగా వారికి ఇద్దరు సంతానం ఉన్నారు.

అయితే క‌రీనా భ‌ర్త సైఫ్ బాలీవుడ్‌లో అత్యంత ధనవంతులలో ఒక‌రు. సైఫ్‌కు సినిమాల నుంచి వచ్చిన ఆస్తి కంటే త‌ర‌త‌రాల నుంచి వ‌చ్చిన ఆస్తులే చాలా ఉన్నాయి. తరాలు కూర్చుని తిన్నా కూడా కరగని ఆస్తిని సైఫ్‌ తండ్రి లెజెండరీ క్రికెటర్ , సంస్థానాదీశుడు మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ ఈయనకు ఇచ్చేసి వెళ్లిపోగా, దానికి తోడు సైఫ్ , క‌రీనాలు కూడా సినిమాల నుంచి మాత్రమే కాకుండా బిజినెస్‌లో కూడా భారీగానే సంపాదించారు. తాజాగా సైఫ్‌ ఆది పురుష్‌లో రావణుడిగా దర్శనమివ్వగా, జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివల కలయికలో వస్తున్న దేవరలో ప్రతినాయకునిగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

 కరీనాకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ దంపతులకు హర్యానాలోని గురుగ్రామ్‌లో అలీశాన్‌ రాజ్‌ మహల్ ఉండ‌గా, దీని ఖ‌రీదు 800 కోట్ల రూపాయ‌ల వ‌రకు ఉంటుంద‌ని స‌మాచారం. వీటితో పాటు ముంబైలోని బాంద్రాలో సద్గురు శరణ్ అపార్ట్ మెంట్, ఫార్చూన్‌ హైట్స్  కూడా ఉన్నాయి. ఇక గురుగ్రామ్‌లోని పటౌడీ హౌజ్ 10 ఎకరాల్లో విస్తరించి ఉండ‌గా, ఇందులో 150 గ‌దులు ఉంటాయ‌ట‌. ఇక ఫార్చూన్‌ హైట్స్ విష‌యానికి వ‌స్తే ఇది 4 అంతస్తుల మేడ కాగా, ఇందులో 3 బెడ్ రూమ్‌లు, ఒక పెద్ద హాలు ఉంటుంద‌ని తెలుస్తుంది. 2013లో దీని విలువ 50 కోట్ల వ‌ర‌కు ఉండేద‌ని ఇప్పుడు మ‌రింత పెరిగింద‌ని తెలుస్తుంది.

కరీనా కపూర్, సైఫ్ దంప‌తుల‌కి స్విట్జర్లాండ్‌లో ని గస్తాద్ పట్టణంలో 33 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ఉంద‌ని టాక్. ఇక కరీనా వ‌స్తువులు, వాడే కార్లు కూడా చాలా ఖ‌రీదేన‌ట‌. ల‌గ్జ‌రీ కార్ల‌ని చాలా ఇష్ట‌ప‌డే క‌రీనా మెర్సిడెస్‌ బెంజ్‌ S-350D లగ్జరీ కారును 2022 అక్టోబర్‌లో కొనుగోలు చేశారు. కొన్ని నివేదికల ప్రకారం ఆ కారు ఆన్‌రోడ్‌ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచ‌నా వేసారు. దీనితో పాటు మెర్సిడెజ్‌, రేంజ్‌రోవర్‌, ఆడి వంటి ఖ‌రీదైన కార్లు కూడా ఈ భామ‌కి ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

ఇక ఈ సీనియ‌ర్ ముద్దుగుమ్మ వాడే వ‌స్తువులు, ధ‌రించే దుస్తులు కూడా చాలా కాస్ట్‌లీ అంటున్నారు. వారికి మెర్సిడెజ్‌, రేంజ్‌రోవర్‌, ఆడి వంటి అతి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయట. అప్పుడ‌ప్పుడు క‌రీనా దంప‌తులు విహార యాత్ర‌ల‌కి వెళ్ల‌గా అక్క‌డ కూడా చాలా ల‌గ్గ‌రియ‌స్‌గా ఉంటార‌ని స‌మాచారం. కాగా బాలీవుడ్‌లో కరీనా కపూర్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ను ఎంత‌గా షేక్ చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కరీనా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.4 వేల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయంటే ఆమె రేంజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.