Samantha -Raj | సమంత- రాజ్ నిడిమోరు వివాహం త‌ర్వాత ఆస్తుల‌పై చ‌ర్చ‌లు .. ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎక్కువ‌?

Samantha -Raj |టాలీవుడ్ అగ్రనటి సమంత రూత్ ప్రభు తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు ఎట్ట‌కేల‌కి చెక్ పెట్టింది. ‘ది ఫ్యామిలీ మాన్’ దర్శకుడు, తన బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో ఆమె డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకుంది.

  • By: sn |    movies |    Published on : Dec 03, 2025 3:44 PM IST
Samantha -Raj | సమంత- రాజ్ నిడిమోరు వివాహం త‌ర్వాత ఆస్తుల‌పై చ‌ర్చ‌లు .. ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎక్కువ‌?

Samantha -Raj |టాలీవుడ్ అగ్రనటి సమంత రూత్ ప్రభు తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు ఎట్ట‌కేల‌కి చెక్ పెట్టింది. ‘ది ఫ్యామిలీ మాన్’ దర్శకుడు, తన బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో ఆమె డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకుంది. లింగ భైరవి దేవాలయంలో పరిమిత అతిథుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అలానే వారి నెట్‌వ‌ర్త్ గురించి కూడా చ‌ర్చ న‌డుస్తుంది.

సమంత స్టార్‌డమ్ నుంచి బిజినెస్ వరకూ..

సినిమా కెరీర్‌తో పాటు బిజినెస్‌లోనూ తన ముద్రవేసిన సమంత, ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. 2010లో ఏ మాయ చేశావేతో ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత, దూకుడు, బృందావనం, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రంగస్థలం వంటి చిత్రాలతో స్టార్‌డమ్‌ను అందుకుంది.తమిళ–తెలుగు చిత్రాలలో వరుస విజయాలతో కెరీర్ సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం ఆమె కెరీర్‌కు మరింత ఊపు తెచ్చింది. ది ఫ్యామిలీ మాన్ 2లో ‘రాజీ’ పాత్రతో ఆమె పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

అయితే అంచనాల ప్రకారం స‌మంత ఒక్కో సినిమాకు: ₹5–8 కోట్లు, వెబ్ సిరీస్‌లకు: ₹8–12 కోట్లు , బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్: సంవత్సరానికి ₹6–8 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని ఆమె నికర సంపద: ₹100–110 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. హైదరాబాద్, చెన్నైలో ఆమె పెట్టుబడులు, స్టార్టప్స్‌ లో ఈక్విటీ కూడా ఆమె ఆస్తులను గణనీయంగా పెంచుతున్నాయి.

రాజ్ నిడిమోరు విష‌యానికి వ‌స్తే.. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జన్మించిన రాజ్ నిడిమోరు, SVUలో కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా తన సహ దర్శకుడు కృష్ణా డీకేను కలిశాడు. ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉండగా సినీ రంగంపై ఉన్న ప్యాషన్ వారిని ముంబయికి తీసుకువచ్చింది. రాజ్–డీకే ద్వయం రూపొందించిన ప్రముఖ ప్రాజెక్టులు చూస్తే.. ది ఫ్యామిలీ మాన్, స్త్రీ, గో గోవా గాన్, షోర్ ఇన్ ది సిటీ, ఏ జెంటిల్‌మ్యాన్. ఓటీటీ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత సక్సెస్‌ఫుల్ మేకర్స్‌లో రాజ్–డీకే పేరుంది. ది ఫ్యామిలీ మాన్ 3 కూడా భారీ విజయాన్ని నమోదు చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

రాజ్ నిడిమోరు నెట్వర్త్‌.. సమంత కంటే తక్కువే!

డైలీ జగ్రన్–పింక్ విల్లా నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు నెట్ వర్త్: ₹83–85 కోట్లు, ఆయన ఆదాయం దర్శకత్వం, స్క్రీన్‌రైటింగ్, ప్రొడక్షన్, ఓటీటీ డీల్స్, థియేట్రికల్ రిలీజ్‌ల ద్వారానే. ఈ లెక్కల ప్రకారం సమంత నికర ఆస్తులు రాజ్ నిడిమోరును దాటి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సమంత ఇప్పుడు నటిగా, వ్యాపారవేత్తగా, బ్రాండ్ విల్యూలోనూ దేశవ్యాప్తంగా కీలక స్థానం దక్కించుకుంది. సమంత–రాజ్ నిడిమోరు వివాహంతో ఇద్దరి వ్యక్తిగత జీవితం కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టగా, వారి స్టార్ పవర్, సంపాదన, భవిష్యత్ ప్రాజెక్టులు మీడియాలో కొత్త చర్చలకు దారితీశాయి.