Salman Khan వయస్సు పెరుగుతున్నా కూడా తన అందంతో అమ్మాయిలని కట్టిపడేస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. మూడు దశాబ్ధాలకి పైగా ఇండస్ట్రీలో ఉన్న సల్మాన్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించారు.ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు పలు షోలకి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ని వివాదాలు ఎప్పుడు చుట్టుముడతూనే ఉంటాయి. ఈ క్రమంలో పలుమార్లు జైలుకి […]
Salman Khan
వయస్సు పెరుగుతున్నా కూడా తన అందంతో అమ్మాయిలని కట్టిపడేస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. మూడు దశాబ్ధాలకి పైగా ఇండస్ట్రీలో ఉన్న సల్మాన్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించారు.ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు పలు షోలకి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే సల్మాన్ ఖాన్ని వివాదాలు ఎప్పుడు చుట్టుముడతూనే ఉంటాయి. ఈ క్రమంలో పలుమార్లు జైలుకి కూడా వెళ్లి వచ్చారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ జైల్లో బాత్రూంలు కడిగాడని ఓప్రచారం అయితే ఉంది. ఈ విషయాన్ని తాజాగా ఓ షోలో ఒప్పుకున్నారు సల్లూ భాయ్.
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం హిందీలో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. మొదటి నుండి ఈ షోకి సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఓటీటీ షో కూడా మొదలు కాగా, దానికి కూడా సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఈ షో చివరి రోజున సల్మాన్ ఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ ఓటీటీలో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ టైటిల్ గెలుచుకోగా, ఫైనలిస్ట్‌లో ఒకరైన పూజా భట్‌పై ప్రశంసలు కురిపించాడు సల్మాన్. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ఇంటిని చాలా నీట్‌గా ఉంచావు. నీ అంత నీట్‌గా ఎవరు ఉంచలేరు. టాయిలెట్స్ కడిగే విషయంలో ఏ మాత్రం మొహమాటపడలేదు అని పూజా భట్‌పై ప్రశంసలు కురిపించారు.
అలానే తాను చదువుకున్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో టాయిలెట్స్ కడిగేవాడిని. అలానే జైల్లో ఉన్నప్పుడు కూడా టాయిలెట్స్ కడిగాను. మనపని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.అందులో మనం సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు అని సల్మాన్ అన్నాడు. ప్రస్తుతం సల్మాన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కొంత కాలం జైల్లో గడపగా,ఇప్పటికీ కూడా ఆ కేసు విషయంలో ఇబ్బందులని ఎదుర్కొంటున్నాడు. అతడిని చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పబ్లిక్‌గానే వార్నింగ్ ఇచ్చింది.