Samantha | కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ని‌ పట్టేసిందా.. సమంతతో క్లోజ్‌గా ఉన్న ఆ వ్యక్తి ఎవరు?

Samantha విధాత‌: ప్రేమలో పడటం, పెళ్ళి సంబరంగా చేసుకోవడం, అంతలోనే విడాకుల వార్త నెట్టింట్లో పోస్ట్ చేసి ఇద్దరం విడిపోతున్నామనే కబురు చల్లగా బయట పెట్టడం ప్రస్తుతం సినీ రంగంలో జరుగుతున్న తంతు. ఈ నేపథ్యంలో ఎవరైనా పెళ్ళని మంచి కబురు చెబితే ఎన్నాళ్ళు కలిసుంటారో అనేలా సెటైర్లు కూడా వెంట వెంటనే వినిపించడం కూడా పరిపాటి అయిపోయింది. మంచి జంటలనుకున్న వారంతా వరుస పెట్టి విడాకులతో వేరై పోవడంతోనే ఇలాంటి సెటైర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ […]

Samantha | కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ని‌ పట్టేసిందా.. సమంతతో క్లోజ్‌గా ఉన్న ఆ వ్యక్తి ఎవరు?

Samantha

విధాత‌: ప్రేమలో పడటం, పెళ్ళి సంబరంగా చేసుకోవడం, అంతలోనే విడాకుల వార్త నెట్టింట్లో పోస్ట్ చేసి ఇద్దరం విడిపోతున్నామనే కబురు చల్లగా బయట పెట్టడం ప్రస్తుతం సినీ రంగంలో జరుగుతున్న తంతు. ఈ నేపథ్యంలో ఎవరైనా పెళ్ళని మంచి కబురు చెబితే ఎన్నాళ్ళు కలిసుంటారో అనేలా సెటైర్లు కూడా వెంట వెంటనే వినిపించడం కూడా పరిపాటి అయిపోయింది.

మంచి జంటలనుకున్న వారంతా వరుస పెట్టి విడాకులతో వేరై పోవడంతోనే ఇలాంటి సెటైర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ మధ్యకాలంలో విడిపోయిన సమంత, చైతు విషయంలో అయితే ఇంత చక్కని జంట ఎందుకు విడిపోతుందో అర్థం కాక చాలా మంది అభిమానులు షాకయ్యారు. కారణాలు ఏవైనా విడిపోయారు ఇద్దరూ.

ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళవన్నట్టు బ్రతుకుతున్నారు. జీవితంలో జరిగిపోయిన దాన్ని త్వరగా మరిచిపోయి మరో జీవితం కోసం, మరో వ్యక్తికోసం కొద్దికాలంలోనే ఆరాటపడటం సినీ జనాలకు మామూలే. అలాంటిది అందరికీ నచ్చిన హీరోయిన్ సమంత విషయంలో ఈమధ్యకాలంలో వినిపించిన వార్తలు, జరిగినన్ని సంఘటనలు, వైరల్ అయినట్టుగా మరెవరి విషయంలోనూ సంచలనం కాలేదు.

అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో హీరోతో జంటగా కనిపిస్తుందనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత మళ్ళీ ప్రేమలో పడిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.విషయంలోకి వెళితే.. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఓ తోడు కావాలి.

అది ఏరంగం అయినా, ఎన్ని విజయాలతో లైఫ్‌లో గొప్పగా బతికేసినా, మనిషి చివరి దశకు చేరుకునే సరికి తోడు కావాల్సిందే. ఎందరు మనకు తోడుగా నిలిచినా పెళ్ళి బంధంతో దగ్గరయ్యే వ్యక్తి మనతో కడదాకా ఉంటారనేది భారతీయ సంస్కృతి గట్టిగా నమ్ముతుంది.

అదే నిజంకూడా. అయితే ఏవో మనస్పర్థలతో విడిపోయాకా, మరో వ్యక్తిని జీవితంలోకి రానీయడం మామూలు ప్రజలకు పెద్ద విషయమే కానీ సినీ జనాలకు మామూలే. ప్రస్తుతం సమంత ఆరోగ్యం బాగాలేదనే వార్తల తర్వాత ఆమె ప్రేమలో ఉందేమో అనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ విషయంలో నిజా నిజాలు సరిగా బయటికి రాకపోయినా, లివ్ ఇన్ రిలేషన్ కల్చర్‌లో ఉందేమో అనేలా గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

సెలబ్రిటీల్లో ఈమధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న ధోరణిలో లివ్ ఇన్ రిలేషన్ కల్చర్ కాస్త ఎక్కువగానే ఉంది. అందులో ముఖ్యంగా ఇలియానా, డింపుల్ హయాతి, శృతి హాసన్, మలైకా అరోరా ఇలా కొందరైతే పెళ్ళికి బై చెప్పి లివింగ్ రిలేషన్ బెస్ట్ అంటూ జీవించేస్తున్నారు.

అయితే ఇందులో కాస్త అడుగు ముందుకు వేసింది ఇలియానా త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నా నని తన బేబీ బంప్ తో ఫోటోలకు ఫోజిలిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీని గురించి మరే వివరాలను పంచుకోలేదు.

ఇదిలా ఉంటే రెండేళ్ళుగా సింగిల్ అనే స్టేటస్ మెయింటైన్ చేస్తున్న సమంత కూడా ఓ తోడు వెతుక్కుందనే వార్త తాజాగా వైరల్ అవుతుంది. ఒక పర్సన్‌తో సమంత చాలా దగ్గరగా ఉన్నట్లుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇక నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎఫైర్ నడుపుతున్నాడనే న్యూస్ నడుస్తుంటే, సమంత ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉందనే ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ప్రస్తుతం సమంత సెర్బియా దేశంలో సిటాడెల్ షూటింగ్‌లో బిజీగా ఉంది.