Samantha | టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో బిబీబిజీగా ఉన్నది. ఓ వైపు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తున్నది. అలాగే సిటాడెల్ సిరీస్ ఇండియన్ వర్షెన్లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషీ షూటింగ్ టర్కీలో మొన్నటి వరకు జరిగింది. తాజాగా సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతుండగా.. టీమ్‌తో సామ్ జాయిన్ అయ్యింది. ప్రస్తుతం అక్కడే షూటింగ్లో పాల్గొంటున్నది. షూటింగ్ సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. అయితే, షూటింగ్ అనంతరం […]
Samantha | టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో బిబీబిజీగా ఉన్నది. ఓ వైపు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తున్నది. అలాగే సిటాడెల్ సిరీస్ ఇండియన్ వర్షెన్లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషీ షూటింగ్ టర్కీలో మొన్నటి వరకు జరిగింది. తాజాగా సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతుండగా.. టీమ్‌తో సామ్ జాయిన్ అయ్యింది. ప్రస్తుతం అక్కడే షూటింగ్లో పాల్గొంటున్నది. షూటింగ్ సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. అయితే, షూటింగ్ అనంతరం బెల్గ్రేడ్లోని ఓ క్లబ్లో సమంత మెరిసింది. అక్కడ పుష్ప చిత్రంలోని ‘ఊ అంటావా మావా’ పాటకు చిందేసింది.
అక్కడే ఉన్న చిత్రం బృందంతో పాటు పలువురు సైతం డాన్స్చేశారు. సిటాడెల్లో సమంతతో కలిసి నటిస్తున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ డ్యాన్స్ చేయాలంటూ సమంతను ఎంకరేజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్కు ప్రీక్వెల్‌గా సమంత నటిస్తున్న సిటాడెల్ రూపొందుతుందని సమాచారం. ప్రస్తుతం సెర్బియా షూటింగ్ షెడ్యూల్‌ను చిత్రబృందం కంప్లీట్ చేసుకుందని తెలుస్తున్నది. మరో వైపు వైపు సమంత చివరిసారిగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ చిత్రంలో కనిపించింది. సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. విజయదేవరకొండతో కలిసి ‘ఖుషీ’లో నటిస్తుండగా.. ఈ చిత్రం కోసం సామ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రానున్నది.
Samantha item song craze is unbelievable