Double iSmart విధాత: పూరి జగన్నాధ్ గురించి చెప్పాలంటే పడిలేస్తున్న కెరటం లాంటి వాడు. ఎప్పుడో డౌన్ అవుతాడో.. ఎప్పుడు ఎగసి పడతాడో తెలియనంతగా ఆయన ప్రయాణం నడుస్తుంది. ‘లైగర్’తో పాన్ ఇండియాని కొట్టాలని చూశాడు. పక్కన ఛార్మీని వేసుకుని.. ఆయన చేస్తున్న ప్రయోగాలకు అంతే లేకుండా పోయింది. అందుకే ‘లైగర్’తో కోలుకోలేని దెబ్బ పడింది. ఇప్పుడా దెబ్బ నుంచి బయటపడేందుకు.. ఇప్పుడెలాగోలా మళ్లీ తన ప్రతాపం చూపేందుకు.. తనకి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ […]
Double iSmart
విధాత: పూరి జగన్నాధ్ గురించి చెప్పాలంటే పడిలేస్తున్న కెరటం లాంటి వాడు. ఎప్పుడో డౌన్ అవుతాడో.. ఎప్పుడు ఎగసి పడతాడో తెలియనంతగా ఆయన ప్రయాణం నడుస్తుంది. ‘లైగర్’తో పాన్ ఇండియాని కొట్టాలని చూశాడు. పక్కన ఛార్మీని వేసుకుని.. ఆయన చేస్తున్న ప్రయోగాలకు అంతే లేకుండా పోయింది. అందుకే ‘లైగర్’తో కోలుకోలేని దెబ్బ పడింది. ఇప్పుడా దెబ్బ నుంచి బయటపడేందుకు.. ఇప్పుడెలాగోలా మళ్లీ తన ప్రతాపం చూపేందుకు.. తనకి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ సినిమానే నమ్ముకున్నాడు.
ఉస్తాద్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టిన పూరీ.. ఇప్పుడా సినిమా సీక్వెల్‌పై పడ్డాడు. ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్‌ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకు ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తుంటే.. ఈసారి పూరి గట్టిగానే కొట్టేలా అనిపిస్తున్నాడు. అయితే మొదటి నుంచి పూరి సినిమాలకు ఇలాంటి టాకే వస్తుంది. కానీ రిలీజ్ తర్వాతే రిజల్ట్ మారిపోతుంది.
ఇక విషయంలోకి వస్తే.. గత బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ అయ్యారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ని మేకర్స్ వదిలారు. ఆ అప్డేట్తో ఈ సినిమా స్వరూపమే మారిపోయింది.
‘కెజియఫ్’ సినిమా అంటే యష్ కాకుండా గుర్తొచ్చే పేరు సంజయ్ దత్. అలాంటి నటుడిని పూరి ‘డబుల్ ఇస్మార్ట్’కు ఒప్పించాడు. ఇందులో ఈ బాలీవుడ్ స్టార్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూట్‌లోకి సంజయ్ దత్ జాయిన్ అయ్యారు.
సంజయ్ దత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో సంజయ్ దత్‌ని బిగ్ బుల్గా పరిచయం చేస్తూ మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. అదిరిపోయిందనే చెప్పాలి.
ఇందులో ఫంకీ హెయిర్‌తో.. గడ్డం, చెవిపోగులు, ఉంగరాలు, ఖరీదైన గడియారం, ముఖం, వేళ్లపై పచ్చబొట్టుతో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు సంజయ్ దత్. సంజయ్ దత్ సిగార్ తాగుతుండగా.. గన్స్ అతని వైపు గురిపెట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈ స్టన్నింగ్ లుక్.. ఇప్పుడీ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
రామ్, సంజయ్ దత్‌లను తెరపై తలబడుతుంటే.. ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే.. ఓ హై వచ్చేస్తోంది. చూద్దాం.. ఈ సినిమాని పూరి ఎలా ప్రజంట్ చేయబోతున్నాడో. కాగా.. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 8 మార్చి, 2024న మహా శివరాత్రి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.