Suryapeta: స‌ర్వాయి పాప‌న్న.. తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: బహుజన బాంధవుడు సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్‌ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 313వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ […]

Suryapeta: స‌ర్వాయి పాప‌న్న.. తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: బహుజన బాంధవుడు సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్‌ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 313వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు, బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని మంత్రి అన్నారు.

అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని మంత్రి అన్నారు. పాపన్న జీవితం స్ఫూర్తిదాయకమని, తెలంగాణ ప్రభుత్వం పాపన్న వర్ధంతి నిర్వహించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు సిఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పిస్తున్నారని తెలిపారు. ఆత్మగౌరవం కోసం వివక్ష, దురభిమానాలకు వ్యతిరేకంగా పోరాడిన‌ సర్వాయి పాపన్న స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు.

నిరంకుశ ‘రాచరిక పోకడలకు’ వ్యతిరేకంగా సమాజంలోని బహుజన సమూహాలను ఏకం చేసి పాపన్న పోరాడారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిసి ,బహుజన సంఘాల ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డిని సత్కరించారు.

గౌడ భవనానికి త్వరలోనే శంకుస్థాప: మంత్రి జగదీష్ రెడ్డి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సంద్భంగా గౌడ బంధువులకు మంత్రి జగదీష్ రెడ్డి తీపి కబురు అందించారు.. వారం, పది రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల రూపాయలతో గౌడ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎకరం నుండి రెండు ఎకరాల వరకు స్థల సేకరణ చేయాలని కలెక్టర్ కు మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ప్రకటనతో గౌడ సోదరులు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మ‌న్ పెరుమాల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, ఎలిమినేటి అభయ్, భరత్ మహాజన్, బాషా మియా, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై. వీ , పట్టణ బీఆర్ ఎస్ ప్రదాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, రాష్ట్ర నాయకులు మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, చిన శ్రీరాములు, భైరు వెంకన్న గౌడ్, రామగిరి నగేష్, కక్కిరేని నాగయ్య గౌడ్, రాపార్తి శ్రీనివాస్ , దేశాగాని శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని వెంకన్న తదతరులు పాల్గొన్నారు.