కస్టమర్లకు SBI షాక్.. పెరగనున్న క్రెడిట్ కార్డ్ చార్జీలు
విధాత: క్రెడిట్ కార్డ్ చార్జీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరిస్తున్నది. దీంతో వచ్చే నెల 17 నుంచి ఇప్పుడున్న చార్జీలు మారనున్నాయి. ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ రూ.100 మేర పెంచుతున్నది. SBI నయా టర్మ్ డిపాజిట్.. వడ్డీరేటెంతో తెలుసా? ప్రస్తుతం ఆయా పన్నులతోపాటు రూ.99 వసూలు చేస్తున్నారు. మార్చి 17 నుంచి ఇది పన్నులతో పాటు రూ.199 కానున్నది. నిజానికి క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులపై ప్రాసెసింగ్ […]

విధాత: క్రెడిట్ కార్డ్ చార్జీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరిస్తున్నది. దీంతో వచ్చే నెల 17 నుంచి ఇప్పుడున్న చార్జీలు మారనున్నాయి. ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ రూ.100 మేర పెంచుతున్నది.
ప్రస్తుతం ఆయా పన్నులతోపాటు రూ.99 వసూలు చేస్తున్నారు. మార్చి 17 నుంచి ఇది పన్నులతో పాటు రూ.199 కానున్నది. నిజానికి క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజును గత ఏడాది నవంబర్‌లోనే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ రూ.99కి పెంచింది. దీనిపై 18 శాతం జీఎస్టీ అదనం. అయినప్పటికీ మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నది.
అయితే ఇప్పటికే ఈ ఏడాది జనవరి మొదలు సింప్లీ క్లిక్ కార్డుదారులకు సంబంధించి పలు నిబంధనలనూ ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం మార్చింది. వోచర్ రిడెంప్షన్, రివార్డు పాయింట్ల రూల్స్‌ను మార్చారు. ఈ మార్పులకు సంబంధించి కస్టమర్లకు మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ రూపంలోనూ ఎస్బీఐ పంపుతున్నది.