SCR | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు
SCR మరికొన్ని దారి మళ్ళింపు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విధాత: వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హసన్ పర్తి- కాజిపేట మార్గంలో ట్రాక్ పై భారీగా నిలిచిన వర్షపు నీరు నిలవడంతో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 11 రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రద్దయిన రైళ్లలో సిర్‌పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ - 17012, సికింద్రాబాద్ - సిర్ పూర్ కాగజ్ నగర్ […]

SCR
- మరికొన్ని దారి మళ్ళింపు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
విధాత: వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హసన్ పర్తి- కాజిపేట మార్గంలో ట్రాక్ పై భారీగా నిలిచిన వర్షపు నీరు నిలవడంతో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 11 రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రద్దయిన రైళ్లలో సిర్‌పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ – 17012, సికింద్రాబాద్ – సిర్ పూర్ కాగజ్ నగర్ – 17233, సిర్ పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ – 17234 రైళ్లు ఉన్నాయి.
పాక్షికంగా రద్దయిన రైళ్లలో తిరుపతి -కరీంనగర్ -12761, కరీంనగర్ -తిరుపతి -12762, సికింద్రాబాద్ -సిర్ పూర్ కాగజ్ నగర్ -12757, సిర్ పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ -12758 రైళ్లు ఉన్నాయి.