నాంపల్లి టూ ముంబయి సీఎస్‌ఎంటీ..! దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించిన రైల్వేశాఖ..!

రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ - ముంబయి మధ్య నడుస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలును లింగంపల్లి వరకు పొడిగించింది

నాంపల్లి టూ ముంబయి సీఎస్‌ఎంటీ..! దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించిన రైల్వేశాఖ..!

Devagiri Express | రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ – ముంబయి మధ్య నడుస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలును లింగంపల్లి వరకు పొడిగించింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 14 నుంచి సికింద్రాబాద్‌ నుంచి కాకుండా లింగంపల్లి నుంచి రైలు ప్రయాణం మొదలవుతుంది.


లింగంపల్లి నుంచి ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (17058) వరకు నడువస్తున్నది. రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.03 గంటలకు బేగంపేట రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. ఇక్కడ రెండు నిమిషాలు ఆగుతుంది. మధ్యాహ్నం 1.20 సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకొని.. 1.25 గంటలకు బయలుదేరి బొల్లారం, కామారెడ్డి, నిజమాబాద్‌, బాసర, ధన్‌బాద్‌, నాందేడ్‌ మీదుగా ముంబయి సీఎస్‌ఎంటీకి చేరుతుంది.


అయితే, సికింద్రాబాద్‌ – ముంబయి మధ్య రైలు ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ (17057) తిరుగు ప్రయాణంలో రాత్రి 9.30 గంటలకు బయలుదేరుతుంది. మరునాడు మధ్యాహ్నం 2.35 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ఇక్కడ ఐదు నిమిషాలు ఆగుతుంది. మళ్లీ 2.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.40 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ప్రయాణికులు రైలు సేవలను వినియోగించుకోవాలని కోరింది.