బొట్టు పెట్టుకుంటేనే ఇంటర్వ్యూ ఇస్తా.. మహిళా జర్నలిస్టుతో అనుచిత వ్యాఖ్యలు
Sambhaji Bhide | మహారాష్ట్రకు చెందిన రైట్ వింగ్ లీడర్ శంభాజీ భిడే మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళా జర్నలిస్టు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారతమాత వితంతువు కాదు.. నుదుటిపై బొట్టు పెట్టుకుంటేనే ఇంటర్వ్యూ ఇస్తానని, అప్పుడే తన వద్దకు రావాలని శంభాజీ చెప్పారు. ప్రస్తుతం శంభాజీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహారాష్ట్ర సచివాలయంలో సీఎం ఏక్ నాథ్ షిండేను శంభాజీ భిడే కలిసి బయటకు వచ్చారు. ఈ క్రమంలో సీఎంను ఎందుకు […]

Sambhaji Bhide | మహారాష్ట్రకు చెందిన రైట్ వింగ్ లీడర్ శంభాజీ భిడే మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళా జర్నలిస్టు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారతమాత వితంతువు కాదు.. నుదుటిపై బొట్టు పెట్టుకుంటేనే ఇంటర్వ్యూ ఇస్తానని, అప్పుడే తన వద్దకు రావాలని శంభాజీ చెప్పారు. ప్రస్తుతం శంభాజీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
మహారాష్ట్ర సచివాలయంలో సీఎం ఏక్ నాథ్ షిండేను శంభాజీ భిడే కలిసి బయటకు వచ్చారు. ఈ క్రమంలో సీఎంను ఎందుకు కలిశారనే విషయంపై ఆరా తీసేందుకు ఓ మహిళా జర్నలిస్టు.. శంభాజీని పలుకరించారు. ఇక శంభాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతమాత వితంతువు కాదు. ప్రతి మహిళా భారతమాతనే అని పేర్కొన్నారు. నుదుటిపై తిలకం పెట్టుకుని వస్తేనే మీ మీడియాతో మాట్లాడుతానని శంభాజీ స్పష్టం చేశారు. అంత వరకు మీకు ఇంటర్వ్యూ ఇవ్వనని తెగేసి చెప్పాడు. శంభాజీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు మహిళలు మండిపడుతున్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకాంకర్ శంభాజీకి నోటీసులు జారీ చేశారు. అయితే శంభాజీ 2018లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పొలంలో పండిన మామిడి పండ్లను తిన్న దంపతులకు కచ్చితంగా అబ్బాయిలే పుడుతారని శంభాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. అభాసుపాలయ్యారు.
శంభాజీ వ్యాఖ్యలపై బాధిత జర్నలిస్టు రూపాలీ బీబీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి సమస్యలు ఎదురవడం సహజమే. మన ఒకరి వయసుకు గౌరవం ఇస్తాం. కానీ అవతలి వ్యక్తికి కూడా ఆ అర్హత ఉండాలి. తిలకం ధరించడం, ధరించకపోవడం, ఎప్పుడు ధరించాలనేది నా హక్కు. మనం ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాం అని రూపాలీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
आज माझ्यासोबत घडलेला हा सगळा प्रकार.. आपण एखाद्याचं वय बघून त्याला मान देतो मात्र, समोरची व्यक्ती देखील त्या पात्रतेची असावी लागते. मी टिकली लावावी-लावू नये किंवा कधी लावावी हा माझा अधिकार आहे. आपण लोकशाही असलेल्या देशात राहतोय. #democracy #freedom pic.twitter.com/wraTJf8mRn
— Rupali B. B (@rupa358) November 2, 2022