అవి నీళ్లా.. డబ్బులా: దిల్ రాజు చేత కోట్లు ఖర్చు పెట్టిస్తున్న శంకర్
విధాత, సినిమా: దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ కానీ ఆయన చేసే చిత్రాలలో డబ్బును నీళ్లలా ఖర్చు పెడతాడు పాటలు ఫైట్స్ ను కోట్లు పెట్టి తీస్తాడు జీన్స్ చిత్రంలోని ఓ పాట కోసం ప్రపంచ వింతలన్నింటి కీ వెళ్లి ఆ పాటను చిత్రీకరించాడు. ఇక ఒకే ఒక్కడులో మగధీర, అపరిచితుడులో రండక రండక, రోబోలో కిలీ మంజరో ఇలా ప్రతి చిత్రంలోను ప్రత్యేకమైన పాటలు ఉండేలా చూసుకుంటాడు. ఇక ఫైట్స్ కోసం సెట్టింగుల కోసం భారీగా […]

విధాత, సినిమా: దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ కానీ ఆయన చేసే చిత్రాలలో డబ్బును నీళ్లలా ఖర్చు పెడతాడు పాటలు ఫైట్స్ ను కోట్లు పెట్టి తీస్తాడు జీన్స్ చిత్రంలోని ఓ పాట కోసం ప్రపంచ వింతలన్నింటి కీ వెళ్లి ఆ పాటను చిత్రీకరించాడు. ఇక ఒకే ఒక్కడులో మగధీర, అపరిచితుడులో రండక రండక, రోబోలో కిలీ మంజరో ఇలా ప్రతి చిత్రంలోను ప్రత్యేకమైన పాటలు ఉండేలా చూసుకుంటాడు. ఇక ఫైట్స్ కోసం సెట్టింగుల కోసం భారీగా కోట్లు ఖర్చు పెట్టిస్తాడు.
ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్‌తో RC 15 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో అద్భుతం అనిపించేలా శంకర్ సన్నివేశాలను మలుస్తున్నట్టు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం 70 కోట్లు ఖర్చు చేశాడట. దీనిని నిడివి ఏడు నిమిషాలని సమాచారం. మరో వైపు 3 పాటల కోసం దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టాడట.
ఇప్పుడు రామ్ చరణ్ అంజలిల పాట కోసం 15 కోట్లు ఖర్చు పెడుతున్నాడని సమాచారం. ఇలా వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి శంకర్ వాలకం చూస్తే అనుకున్న బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువ పెట్టించేలా ఉన్నాడు. అయినా కూడా దానికి తగ్గ ఫలితాన్ని అందించడంలో శంకర్ సిద్ధహస్తుడు. కాబట్టే ఆయన కోరితే ఎంతైనా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. అయినా శంకర్, రాజమౌలిలతో చిత్రం అంటే అది పులిస్వారీతో సమానం.
ఒక్కసారి కమిట్ అయి వారితో సినిమా ప్రారంభించారంటే ఇక వారు ఏది కోరితే అది అందించే బాధ్యత నిర్మాతలదే. అటు సినిమా పూర్తి చేయలేక మధ్యలో ఆపేయలేక నానా తిప్పలు పడాల్సిందే. అయితే శంకర్ ఖర్చు పెట్టే ప్రతి పైసా వెండితెరపై మనకు కనిపిస్తుంది. ఆ తపన, ఆ కాస్ట్లీనెస్, భారీతనం, హంగామా అన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. మొత్తానికి RC15 చిత్రంపై ఈ వార్తలు అంచనాలను పెంచుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో దిల్ రాజుకే తెలియాలి..!