Sherlyn Chopra | ద‌ర్శ‌కులు న‌న్ను అక్క‌డ ట‌చ్ చేస్తామ‌ని అడిగారు.. షెర్లిన్ సంచ‌ల‌న కామెంట్స్

Sherlyn Chopra: కామసూత్ర త్రీడీ సినిమా ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్‌గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ‌ షెర్లీన్ చోప్రా. ఈ అమ్మ‌డు తెలుగులో ఎ ఫిలిం బై అరవింద్ అనే సినిమాలో సైతం నటించింది. పాత్ర న‌చ్చితే ఎలాంటి పాత్ర‌లోనైన న‌టించేందుకు రెడీగా ఉంటుంది షెర్లిన్ చోప్రా. ఈ అమ్మ‌డు ప్రముఖ శృంగార పత్రిక ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేసిన మొదటి భారతీయురాలిగా ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది. ఇక వివాదాల‌తో కూడా షెర్లిన్ […]

  • Publish Date - July 23, 2023 / 03:53 AM IST

Sherlyn Chopra:

కామసూత్ర త్రీడీ సినిమా ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్‌గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ‌ షెర్లీన్ చోప్రా. ఈ అమ్మ‌డు తెలుగులో ఎ ఫిలిం బై అరవింద్ అనే సినిమాలో సైతం నటించింది. పాత్ర న‌చ్చితే ఎలాంటి పాత్ర‌లోనైన న‌టించేందుకు రెడీగా ఉంటుంది షెర్లిన్ చోప్రా. ఈ అమ్మ‌డు ప్రముఖ శృంగార పత్రిక ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేసిన మొదటి భారతీయురాలిగా ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది.

ఇక వివాదాల‌తో కూడా షెర్లిన్ చోప్రా అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయ‌ని, అత‌ని వ‌ల‌న షూటింగ్‌లో కూడా పాల్గొన‌ లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చింది షెర్లిన్. అలానే సల్మాన్ ఖాన్ పై కూడా షెర్లిన్ ఇలానే విమర్శలు గుప్పించింది. కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న‌ దర్శకుడు సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ రియాల్టీ షోకు తీసుకోవడంపై కూడా ఘాటుగా స్పందించింది.

ఇక నటి షెర్లిన్ చోప్రా నటించిన పౌరుష్‌పూర్-2 త్వరలో ఓటీటీలో విడుదల కానుండ‌గా, తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుల నుంచి త‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తాయో చెప్పుకొచ్చింది. నా రొమ్ముల‌ని శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారా అని అడిగిన ద‌ర్శ‌కులు ఉన్నారు. అప్పుడు తాను అబద్దం చెప్పడానికి కారణాలు ఏమీ లేక ఫీలయ్యాను. ‘‘అవును నా బ్రెస్ట్ ఫ్లాట్ గా ఉండటం నచ్చక, చేయించుకున్నాను’’ అని సమాధానం ఇచ్చాను. నా ఛాతిని ఒక‌సారి తాక‌వ‌చ్చా అని కూడా అడిగారు. కొంద‌రు సైజ్ ఎంత అని అడ‌గ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాను. మీకు పెళ్లి అయింది. మీకు స్త్రీ శరీర నిర్మాణం గురించి తెలిసే ఉంటుంది క‌దా అని ద‌ర్శ‌కుడిని అడిగితే అప్పుడు ఆయ‌న‌.. నేను నా భార్యతో ఎక్కువగా మాట్లాడను అని స‌మాధానం ఇచ్చాడ‌ని చెప్పింది షెర్లిన్.

ఇక నేను కొన్ని సంద‌ర్బాల‌లో డిప్రెష‌న్‌కి కూడా లోన‌య్యాను. ఆ సంద‌ర్భంలో నన్ను డ్ర‌గ్స్ తీసుకోవాల‌ని చాలా మంది సూచించారు. అయితే వాటికి నేనెప్పుడు లొంగ‌లేదు అని షెర్లిన్ చెప్పుకొచ్చింది. ఇక 2021లో నా కిడ్నీ ఒక‌టి ఫెయిల్ కావ‌డం నా జీవితంలో విషాద‌క‌ర‌మైన ఘ‌ట్టం. నా జీవితంలో ఒక్క‌రోజు అయిన నేను సంపూర్ణంగా జీవించాల‌ని అనుకుంటున్నాను అంటూ షెర్లిన్ చెప్పుకొచ్చింది. కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ భార్య‌ల‌తో శృంగారం గురించి అంత‌గా సంభాషించ‌ లేక‌పోతున్న‌ట్టు కూడా త‌న‌తో తెలియ‌జేశార‌ని కూడా షెర్లిన్ పేర్కొంది. షెర్లిన్ వ్యాఖ్య‌లు బీటౌన్‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Latest News