Siddharth | అదితితో ప్రేమలో ఉన్న సిద్ధార్థ్‌కి పెళ్లైందన్న విషయం తెలుసా.. భార్యతో ఎందుకు విడిపోయారంటే..!
Siddharth: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ జంట ఇటీవలి కాలంలో తెగ సందడి చేస్తున్నారు. వారిద్దరు ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తుండడం చర్చనీయాంశంగా మారుతుంది. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు పెరుగుతుండడంతో త్వరలోనే వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. అయితే వీరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో సిద్ధార్థ్ పెళ్లి విషయం కూడా ఫ్రేమ్‌లోకి వచ్చింది. సిద్ధార్థ్ తొలుత మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరిని పిల్లలకి కూడా జన్మనిచ్చారని […]

Siddharth: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ జంట ఇటీవలి కాలంలో తెగ సందడి చేస్తున్నారు. వారిద్దరు ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తుండడం చర్చనీయాంశంగా మారుతుంది. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు పెరుగుతుండడంతో త్వరలోనే వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. అయితే వీరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో సిద్ధార్థ్ పెళ్లి విషయం కూడా ఫ్రేమ్‌లోకి వచ్చింది. సిద్ధార్థ్ తొలుత మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరిని పిల్లలకి కూడా జన్మనిచ్చారని చెబుతుంటారు. వారి వైవాహిక బంధం సజావుగా సాగుతున్న సమయంలో సిద్ధార్థ్‌కి బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తో పరిచయం ఏర్పడింది.
సిద్ధార్థ్, సోహా అలీ ఖాన్ పీకల్లోతు ప్రేమలో ఉండడం, ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేయడంతో మేఘన ఆయనకి విడాకులు ఇచ్చినట్టు సమాచారం. ఇక మేఘనకి విడాకులు ఇచ్చిన సిద్ధార్థ్.. సోహా అలీ ఖాన్‌తో కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేదు. ఆమెకి కొన్ని రోజులకే బ్రేకప్ చెప్పాడు. అనంతరం సమంతతో ప్రేమాయణం నడిపించాడు. ఇద్దరు కూడా కలిసి తిరగడంతో వారిరివురు పెళ్లి చేసుకుంటారేమో అని అందరు అనుకున్నారు. కాని ఇద్దరికి ఎక్కడ చెడిందో కాని సిద్ధార్థ్ కి బ్రేకప్ చెప్పిన సమంత.. నాగ చైతన్యని వివాహం చేసుకుంది.
ఇక సిద్ధార్థ్ ప్రస్తుతం అదితి రావు హైదరితో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం , అంతేకాక ‘ప్రిన్సెస్ ఆఫ్ ది హార్ట్’ అనే క్యాప్షన్‌తో అదితి ఫోటోను సిద్ధార్థ్ షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని అందరిలో అనుమానాలు బలపడ్డాయి. శర్వానంద్ నిశ్చితార్థానికి, పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వచ్చారు. కొన్ని రోజులుగా వీరి మధ్య రిలేషన్ మీద బాగా చర్చ నడుస్తుండగా,వీరు మాత్రం తమ రిలేషన్‌పై ఎలాంటి ప్రకటన చేయడం లేదు.ఏదేమైన సిద్ధార్థ్ సినిమాల కన్నా కూడా ప్రేమాయాణాలతోనే ఎక్కువ హాట్ టాపిక్ అవుతుండడం విశేషం.