Singer Nava Sandeep | శారీర‌కంగా వాడుకొని.. యువ‌తిని మోసం చేసిన జ‌బ‌ర్ధ‌స్త్ ఆర్టిస్ట్ న‌వ సందీప్!

Singer Nava Sandeep | ఇటీవ‌ల జ‌బ‌ర్ధ‌స్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీకి చెందిన ప‌లు ఆర్టిస్ట్‌లు వివాదాలతో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ స్టేజ్‌ని ఉప‌యోగించుకొని మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్న వారు మ‌హిళ‌ల‌ని మోసం చేసిన విష‌యంతో వార్త‌ల‌లో నిల‌వ‌డం శోచ‌నీయం. తాజాగా జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌, సింగర్‌ నవ సందీప్ ఓ యువతిని మోసం చేశాడని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తనను ప్రేమించానని […]

  • By: sn    latest    Aug 20, 2023 6:30 AM IST
Singer Nava Sandeep | శారీర‌కంగా వాడుకొని.. యువ‌తిని మోసం చేసిన జ‌బ‌ర్ధ‌స్త్ ఆర్టిస్ట్ న‌వ సందీప్!

Singer Nava Sandeep |

ఇటీవ‌ల జ‌బ‌ర్ధ‌స్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీకి చెందిన ప‌లు ఆర్టిస్ట్‌లు వివాదాలతో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ స్టేజ్‌ని ఉప‌యోగించుకొని మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్న వారు మ‌హిళ‌ల‌ని మోసం చేసిన విష‌యంతో వార్త‌ల‌లో నిల‌వ‌డం శోచ‌నీయం. తాజాగా జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌, సింగర్‌ నవ సందీప్ ఓ యువతిని మోసం చేశాడని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

తనను ప్రేమించానని చెప్పిన న‌వ సందీప్ శారీరకంగా వాడుకుకొని వ‌దిలేశాడంటూ యువతి ఫిర్యాదు చేయ‌గా, ఆమె ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. నవ సందీప్‌కు 2018లో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ 28 ఏళ్ల యవతి పరిచయం కాగా, ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకొని సంతోషంగా తిరిగారు.

కొద్ది రోజుల‌కి విష‌యం ఇంట్లో తెలియ‌డంతో సందీప్ ఆ యువ‌తిని హైదరాబాద్ కి పిలిపించాడు. షేక్పేట్‌లోని అల్ హమారా కాలనీలోని ఓ హాస్టల్లో ఆమె నాలుగు సంవత్సరాలుగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ప‌లుమార్లు వారు శారీరికంగా కూడా ద‌గ్గ‌ర‌య్యారు. అయితే త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని ఆ యువ‌తికి చెప్పి ఇప్పుడు వేరే యువ‌తిని చేసుకునేందుకు సందీప్ సిద్ధ‌య్యాడ‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే బాధితురాలు గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో సందీప్ పై ఫిర్యాదు చేయ‌గా, యువ‌తి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును మధురానగర్ పోలీసుస్టేషన్‌కు కేసును బదిలీ చేయ‌గా, వారు ఈ కేసును విచారణ చేస్తున్నారు.

సందీప్ విష‌యానికి వ‌స్తే.. ఫోక్‌ సింగర్‌గా గుర్తింపు పొంది జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల్లో పలు సందర్భాల్లో తన పాటలతో ఎంత‌గానో అల‌రించాడు. ఇప్పటి వ‌ర‌కు ఎన్నో జానపద గీతాలు పాడిన నవ సందీప్‌ ఓ వేదికపై నందమూరి బాలకృష్ణ ముందు ‘బాలయ్యబాబు గారూ.. మీకు సాటి ఎవ్వరూ లేరు.. నేను చేసినాను హోరు’ అంటూ పాడ పాటగా, ఈ పాట నెట్టింట తెగ వైరల్ అయింది. మంచి టాలెంట్ ఉన్న సందీప్ ఇలా చేయ‌డం ప‌ట్ల కొంద‌రు త‌మ‌ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.