స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం నియమించింది

  • By: Somu |    latest |    Published on : Nov 29, 2023 8:38 AM IST
స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు

విధాత : తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు పునరావాసం, భూసేకరణ విభాగ డైరెక్టర్‌ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


నీటీ పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్‌ కుమార్‌ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండటంతో ప్రభుత్వం ఆ స్థానంలో స్మితా సభర్వాల్‌ను నియమిస్తు నిర్ణయం తీసుకుంది.